కాలి గోళ్లకు.. రాళ్ల నగ!
నెయిల్ ఆర్ట్.. గోళ్ల అలంకరణ కోసమే పుట్టుకొచ్చిన కళ. చేతి వేళ్లనే కాదు, కాలిగోళ్లనూ దీంతో అందంగా ముస్తాబు చేసుకోవచ్చు. ఇందుకు సృజన, కళ, అంతకు మించి ఓపిక ఉండాలి. ఇవేవీ లేకున్నా గోళ్లను అందంగా అలంకరించుకునేందుకు సాయపడతాయి ‘స్టోన్ స్టడెడ్ టో నెయిల్స్'.
నెయిల్ ఆర్ట్.. గోళ్ల అలంకరణ కోసమే పుట్టుకొచ్చిన కళ. చేతి వేళ్లనే కాదు, కాలిగోళ్లనూ దీంతో అందంగా ముస్తాబు చేసుకోవచ్చు. ఇందుకు సృజన, కళ, అంతకు మించి ఓపిక ఉండాలి. ఇవేవీ లేకున్నా గోళ్లను అందంగా అలంకరించుకునేందుకు సాయపడతాయి ‘స్టోన్ స్టడెడ్ టో నెయిల్స్’. రాళ్లను పొదిగిన గోళ్లను కాలికి అతికించుకోవడం ఇందులోని విశేషం.
నఖశిఖ పర్యంతం.. అన్నట్టు అలంకరణ అంతటా ముఖ్యమే. అందుకే జుట్టును ముచ్చటగా ముడివేసినట్టే, కాలి గోళ్లనూ కళగా అలంకరించుకుంటారు. పసుపు పాదాలకు పారాణి రాసి సంప్రదాయాన్ని చూపిన చోటే ఫేక్ నెయిల్స్ అతికించుకుని ఫ్యాషన్‌నూ ప్రదర్శిస్తారు. పాదాలకు పొందికగా పెడిక్యూర్చేసి, గోళ్లకు నెయిల్ ఆర్ట్ వేసినట్టు కనిపించేలా.. నిజమైన గోళ్లను పోలినట్టు ఉంటున్నాయి ఫేక్ నెయిల్స్. వాటికి రకరకాల రాళ్లు, కుందన్లు అలంకరించడం కొత్త ట్రెండ్. ఈ స్టోన్ స్టడెడ్ టో నెయిల్స్.. తెలుపుతో పాటు బంగారు రంగులోనూ, మల్టీ కలర్ రాళ్లు, కుందన్లతోనూ లభిస్తున్నాయి.
రంగు రంగుల నెయిల్ పాలిష్‌ల మీద విభిన్న ఆకృతుల్లో ఈ స్టోన్ నెయిల్స్‌ను తయారు చేస్తున్నారు. కొన్నిటిలో రాళ్లకు తోడు నెయిల్ ఆర్ట్ వేసీ ముస్తాబు చేస్తున్నారు. వివిధ వేడుకలప్పుడు ధరించడానికి బాగుంటాయి. మనం చేయాల్సిందల్లా ఫేక్ నెయిల్స్‌తో పాటు వచ్చే గ్లూతో వీటిని అతికించుకోవడమే. నెయిల్ ఆర్ట్ రాకపోయినా, నెయిల్ పాలిష్ వేసుకోవడం తెలియకపోయినా పార్టీలో మెరిసిపోవచ్చు!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

