Anushka Sen | ఆమే ఒక సైన్యం.. సోషల్ మీడియా పాపులారిటీతో అనుష్క సేన్‌కు బంపర్ ఆఫర్
సినీ సెలెబ్రిటీలు కూడా మరింత పాపులర్ కావడానికి సోషల్ మీడియాపై ఆధారపడుతున్న రోజులివి. అలాంటి సామాజిక మాధ్యమాల్లో కోట్ల మంది ఫాలోవర్లతో అదరగొడుతున్నది భారతీయ మోడల్, నటి అనుష్క సేన్. ఇన్‌స్టాలో తన అభిమానుల సంఖ్య ఇంతలంతలుగా పెంచేసుకుంటున్నది. ఈమెగారిని ఫాలో అవుతున్న వారి సంఖ్య నాలుగు కోట్లకు దగ్గరైంది. ‘నాతోపాటే నా అభిమానుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది.
Anushka Sen | సినీ సెలెబ్రిటీలు కూడా మరింత పాపులర్ కావడానికి సోషల్ మీడియాపై ఆధారపడుతున్న రోజులివి. అలాంటి సామాజిక మాధ్యమాల్లో కోట్ల మంది ఫాలోవర్లతో అదరగొడుతున్నది భారతీయ మోడల్, నటి అనుష్క సేన్. ఇన్‌స్టాలో తన అభిమానుల సంఖ్య ఇంతలంతలుగా పెంచేసుకుంటున్నది. ఈమెగారిని ఫాలో అవుతున్న వారి సంఖ్య నాలుగు కోట్లకు దగ్గరైంది. ‘నాతోపాటే నా అభిమానుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. వాళ్లను నా సైన్యంగా భావిస్తాను. వారి ఆదరణే నాకు ఆత్మవిశ్వాసాన్ని, స్ఫూర్తిని ఇస్తుంది’ అంటూ అభిమానులే తన బలం అంటున్నది అనుష్క సేన్.
‘కాకపోతే, మనం ఓ రంగంలో అభిమానులను సంపాదించుకుంటుంటే మనకంటే పెద్దవాళ్లకు గిట్టకపోవచ్చని, అది మన స్నేహసంబంధాలపై ప్రభావం చూపుతుంద’ని చెప్పుకొచ్చింది. బాల్ వీర్, ఝాన్సీ కీ రాణి సీరియళ్లతో టెలివిజన్ ప్రేక్షకులను అలరించిన అనుష్క ఇప్పుడు ఓ కొరియన్ సినిమాలోనూ కనిపించనుంది. ఇన్‌స్టా అకౌంట్ ద్వారా తన గురించి తెలుసుకుని వాళ్లంతట వాళ్లే తనను వెతుక్కుంటూ వచ్చారని తెగ సంబురపడిపోతున్నది అనుష్క. ఈ ప్రాజెక్ట్ రావడానికి తన సోషల్ మీడియా పాపులారిటీ ఎంతగానో ఉపయోగపడిందని గొప్పగా చెప్పుకొంటున్నది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

