Health tips | వయసు మీరుతున్నా యంగ్‌గా కనిపించాలని ఉందా.. అయితే ఈ జ్యూస్ తాగండి..!
Health tips | వయసు పైబడి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నప్పుడు చాలామంది ఆందోళన చెందుతుంటారు. చర్మంపై ముడతలు చూసుకుని బాధపడుతుంటారు. కొంతలో కొంతైనా వయసును దాచుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో ఆడా, మగా అనే తేడా ఏమీ లేదు. ఇరువురిలోనూ వృద్ధాప్యాన్ని దాచేందుకు ప్రయాసపడే వారుంటారు. మరె మీరు అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారా..? అయితే మీ కోసం ఓ చక్కని చిట్కా తీసుకొచ్చా. అదేంటో ఇప్పుడే తెలుసుకుందాం..
Health tips: వయసు పైబడి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నప్పుడు చాలామంది ఆందోళన చెందుతుంటారు. చర్మంపై ముడతలు చూసుకుని బాధపడుతుంటారు. కొంతలో కొంతైనా వయసును దాచుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో ఆడా, మగా అనే తేడా ఏమీ లేదు. ఇరువురిలోనూ వృద్ధాప్యాన్ని దాచేందుకు ప్రయాసపడే వారుంటారు. మరె మీరు అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారా..? అయితే మీ కోసం ఓ చక్కని చిట్కా తీసుకొచ్చా. అదేంటో ఇప్పుడే తెలుసుకుందాం..
సాధారణంగా మునగాకు పోషకాల గని. మునగాకులో మనకు కావాల్సిన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్ సమృద్ధిగా లభ్యమవుతాయి. గర్భిణిలు ఈ మునగాకు తింటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇతర ఆహార పదార్థాలతో పోల్చితే మునగాకులో పోషకాలు రెండింతలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్, చర్మ సమస్యలు, జుట్టుకు సంబంధించిన సమస్యలు తదితర ఎన్నో సమస్యలకు మునగాకు జ్యూస్‌తో చెక్ పెట్టొచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మునగాకు జ్యూస్‌తో ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
యవ్వనంగా కనిపించడం
మునగాకు జ్యూస్ తరచూ తాగడంవల్ల చర్మం ముడుతలు లేకుండా యవ్వనంగా కనిపిస్తుంది. మీ వయసు ఎంత పైబడినా ఎవర్ యూత్‌గా ఉంటారు. అంతేకాకుండా ముఖంపై మచ్చలు, మొటిమలు వంటివి తగ్గి కాంతివంతంగా మెరుస్తుంది. కాబట్టి యంగ్‌గా కనిపించాలనుకునే వారికి మునగాకు జ్యూస్ మంచి ప్రయోజనకారి అని చెప్పవచ్చు.
కంటి చూపు మెరుగు
మునగాకు జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. వృద్ధాప్యంలో కూడా కంటిచూపు చక్కగా కనిపిస్తుంది. కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా అదుపులోకి వస్తాయి.
ఎముకలకు బలం
ఈ రోజుల్లో చాలామంది కాల్షియం లోపం కారణంగా ఎముకల బలహీనతతో ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన నొప్పులను భరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారికి మునగాకు జ్యూస్ మంచి పరిష్కారం. ఆర్థరైటిస్ లాంటి కీళ్ల సమస్యలను మునగాకు జ్యూస్‌తో తగ్గించుకోవచ్చు. రెగ్యులర్‌గా మునగాకు జ్యూస్ తాగితే ఫలితం కనిపిస్తుంది.
అదుపులో మధుమేహం
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే లక్షణం మునగాకులో ఉంటుంది. మధుమేహం సమస్య ఉన్న వారు క్రమం తప్పకుండా మునగాకు రసం తాగడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. షుగర్ స్థాయిలు అదుపులోకి వస్తాయి.
గుండెకు మేలు
ఒకప్పుడు 50 ఏళ్లు దాటితేగానీ గుండె సమస్యలు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చిన్నచిన్న పిల్లలే గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ గుండె జబ్బులకు ప్రధాన కారణం రక్త నాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం. మునగాకు జ్యూస్ తాగడం వల్ల రక్త నాళాల్లో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. కాబట్టి క్రమం తప్పకుండా మునగాకు జ్యూస్ తీసుకోవడం గుండెకు మేలు చేస్తుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

