పుదీనాతో పుట్టెడు లాభాలు..!
Health tips: పుదీనా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా పుదీనాను వివిధ రకాల మాంసాహార, శాఖాహార

హైదరాబాద్: పుదీనా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా పుదీనాను వివిధ రకాల మాంసాహార, శాఖాహార వంటకాల్లో వినియోగిస్తాం. వంటల్లోనేగాక టీ లు, సలాడ్స్, మజ్జిగ, వివిధ రకాల జ్యూస్‌లలో కూడా పుదీనాను వాడుతాం. పుదీనాను జోడించడం ద్వారా వివిధ రకాల పదార్థాలకు చక్కని వాసన, రుచి కూడా వస్తుంది. అంతేగాక ఇది తక్కువ పరిమాణంలోనే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.
వేసవిలో పుదీనాను ఎక్కువగా వినియోగించడం ఆరోగ్యానికి మంచిది. గుప్పెడు పుదీనా ఆకుల్లో ఒకరోజు మొత్తానికి కావాల్సిన విటమిన్-ఎ లో పది శాతం లభిస్తుంది. అజీర్తి, గ్యాస్ సమస్యలను ఎదుర్కోవడానికి కూడా పుదీనా బాగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే టీ, కాఫీలకు బదులుగా పుదీనా వేసి, కాచిన నీళ్లు తీసుకుంటే అది మెదడు చురుకుదనాన్ని పెంచి జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది. తరచూ పుదీనా ఆకులు నమలడంవల్ల నోటి దుర్వాసనను కూడా దూరం చేసుకోవచ్చు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత
Health tips | ఆ ఆరోగ్య సమస్యలకు పుదీనాతో చక్కటి పరిష్కారం.. తెలుసా..?
దీపం వెలిగించి వెళ్లిన కొద్దిసేపటికే అగ్నికి ఆహుతైన ఇల్లు
Deeksha Divas | బీఆర్ఎస్ శ్రేణులంతా దీక్షా దివస్‌లో పాల్గొనాలి.. సీనియర్ నాయకుడు పార్సి రంగారావు పిలుపు
Special Trains | సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

