Nikah Terinsip | ఎంత పనైంది.. సరదాగా తీసుకున్న వీడియో అందాల తార కిరీటాన్ని దూరం చేసింది..
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత చాలామంది రాత్రికి రాత్రే పాపులర్ అవుతున్నారు. అదే సమయంలో దాని కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వాళ్లూ ఉంటున్నారు.
Nikah Terinsip | సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత చాలామంది రాత్రికి రాత్రే పాపులర్ అవుతున్నారు. అదే సమయంలో దాని కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వాళ్లూ ఉంటున్నారు. సరిగ్గా అలాంటి పరిస్థితే మలేషియా అందాల తార వీరూ నికాహ్ టెరిన్సిప్కు ఎదురైంది. సరదాగా తీసుకున్న ఒక వీడియో ఆమెకు దక్కిన అందాల తార కిరీటాన్ని దూరం చేసింది. వీరూ నికాహ్.. 2023లో మలేషియాలో అందాల కిరీటాన్ని కైవసం చేసుకుంది.
అయితే, ఆమెకు ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తరచూ సరదా వీడియోలు పోస్టు చేస్తుంటుంది. ఇటీవల కుటుంబంతో కలిసి థాయ్లాండ్ విహారానికి వెళ్లింది. అక్కడ చిట్టిపొట్టి దుస్తులు ధరించి సరదాగా నృత్యం చేసింది. ఆ డ్యాన్స్ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసింది నికాహ్. ఆ వీడియో అసభ్యకరంగా ఉందంటూ నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఆమెకు కిరీటాన్ని ప్రదానం చేసిన సంస్థ.. ‘నికాహ్ తీరుపై చాలామంది ఫిర్యాదు చేశారు.
సరదా అయితే మాత్రం.. సోషల్ మీడియాలో పోస్టు చేసేముందు తానో సెలెబ్రిటీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి పనులు చేయకూడదనే ఉద్దేశంతో ఆమెకు ఇచ్చిన అందాల తార కిరీటాన్ని వెనక్కి తీసుకుంటున్నాం’ అని ప్రకటించింది. ఈ మేరకు నికాహ్ తన కిరీటాన్ని ఆ సంస్థకు ఇచ్చేసింది. టైటిల్ తిరిగి ఇచ్చేయడంలో ఎవరి బలవంతం లేదనీ, తనపై తనకు గల నమ్మకమే అన్నిటికన్నా విలువైనదనీ పేర్కొన్నది వీరూ నికాహ్.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

