లండన్ చిట్టినాయుడు
‘రెడీ’ సినిమాలో చిట్టినాయుడు పాత్ర గుర్తుందిగా! పొడవాటి జుట్టుతో.. పిలక పెట్టుకొని బడికి వెళ్తుంటాడు. ఆ సినిమాలో కటింగ్‌కు వంశాచారం అడ్డొచ్చింది! లండన్‌లో పన్నెండేండ్ల ఫారుఖ్ జేమ్స్‌ది ఇంతకు మించిన చిత్రమైన కథ. వంశాచారం ప్రకారం మూడేండ్ల వరకు తలనీలాలు కత్తిరించొద్దని ఇంట్లోవాళ్లు జేమ్స్ జుట్టును చక్కగా పెంచారు.
‘రెడీ’ సినిమాలో చిట్టినాయుడు పాత్ర గుర్తుందిగా! పొడవాటి జుట్టుతో.. పిలక పెట్టుకొని బడికి వెళ్తుంటాడు. ఆ సినిమాలో కటింగ్‌కు వంశాచారం అడ్డొచ్చింది! లండన్‌లో పన్నెండేండ్ల ఫారుఖ్ జేమ్స్‌ది ఇంతకు మించిన చిత్రమైన కథ. వంశాచారం ప్రకారం మూడేండ్ల వరకు తలనీలాలు కత్తిరించొద్దని ఇంట్లోవాళ్లు జేమ్స్ జుట్టును చక్కగా పెంచారు. జుట్టంతా పిచ్చుకల గూడులా తయారయ్యాక సెలూన్‌కు తీసుకెళ్తే జేమ్స్ ఉక్కిరిబిక్కిరయ్యాడు.
ఇతరులకు కటింగ్ చేస్తున్న దృశ్యాలు చూసి బావురుమన్నాడు. తమ పుత్రరత్నం కంగారుపడటం చూసి తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. జేమ్స్‌కు హెయిర్ కటింగ్ ఫోబియా ఉందని తేలింది. దీనిని టాన్సురే ఫోబియా అంటారు. ఇక చేసేది లేక అబ్బాయి జుట్టును ఒద్దికగా పెంచుతూపోయారు తల్లిదండ్రులు. ఇంతవరకు బాగానే ఉన్నా.. నాలుగేండ్ల నుంచి ఈ కుర్రాడిని క్లాస్‌రూమ్‌కు రావొద్దంటూ ఉపాధ్యాయులు ఆంక్షలు విధించడం మొదలైంది.
తాజాగా స్కూలు యాజమాన్యం జేమ్స్‌ను కటింగ్ చేసుకుంటే గానీ బడికి రావొద్దని తేల్చిచెప్పింది. యూనిఫామ్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఉండటం వల్లే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. దీనిని సవాలుగా తీసుకున్న జేమ్స్ తన సమస్యను చెబుతూ సోషల్ మీడియాకెక్కాడు. పలు డిజిటల్ మీడియా చానల్స్‌కు ఇంటర్వ్యూలూ ఇచ్చాడు.
దీంతో బారెడంత కురులవాడికి సామాజిక మాధ్యమాల్లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. అతగాడి ఇన్‌స్టా హ్యాండిల్ ఫాలోవర్ల సంఖ్య రెండున్నర లక్షలకు చేరింది. జేమ్స్ సమస్యపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ‘జుత్తున్న జేమ్స్ ఏ కొప్పు కడితే మాత్రం ఎవరికి సమస్య’ అని కొందరు సమర్థిస్తున్నారు. ‘రూల్స్ ఆర్ రూల్స్’ అని మరికొందరి వాదన! లండన్ చిట్టినాయుడి సమస్య ఎప్పటికి తేలుతుందో చూడాలి!!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Farouk James
- hair
- london
- Long Hair
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

