చిన్నారులకు చాయ్ తాగించకండి.. హాని చేస్తుంది!
మనలో చాలామంది ఉదయం నిద్రలేవగానే చాయ్ తాగితేగాని ఆ రోజును మొదలుపెట్టరు. రోజుకు మూడు నాలుగు సార్లు టీ తాగేవారూ ఉన్నారు. ఇక చలికాలం వచ్చిందంటే ఈ లెక్క పెరుగుతుందే కానీ, తగ్గదు. ఇంట్లో పెద్దలు అస్తమానం టీ తాగుతుంటే పిల్లలు తమకూ ఇవ్వమని పట్టుబడుతుంటారు.
మనలో చాలామంది ఉదయం నిద్రలేవగానే చాయ్ (Tea) తాగితేగాని ఆ రోజును మొదలుపెట్టరు. రోజుకు మూడు నాలుగు సార్లు టీ తాగేవారూ ఉన్నారు. ఇక చలికాలం వచ్చిందంటే ఈ లెక్క పెరుగుతుందే కానీ, తగ్గదు. ఇంట్లో పెద్దలు అస్తమానం టీ తాగుతుంటే పిల్లలు తమకూ ఇవ్వమని పట్టుబడుతుంటారు. దీంతో చిన్నారులకు సైతం టీ తాగిస్తుంటారు. కానీ, చిన్నారులకు చాయ్ హాని చేస్తుంది. టీలో ఉండే టానిన్లు ఐరన్ లోపానికి దారి తీస్తాయి. అప్పటికే పప్పుధాన్యాలు, కూరగాయలు, పాలకూర తినడానికి మొండికేసే చిన్నారులు టీ తాగడం వల్ల ఐరన్ లోపంతో బలహీనపడుతారు. ఐరన్ లోపం కేవలం రక్తహీనతకు మాత్రమే పరిమితం కాకుండా పిల్లల మెదడు ఎదుగుదలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
మరోవైపు మానసికంగా ఇబ్బందిపడుతూ కొన్నిసార్లు మట్టి, గోడల సున్నాన్ని తింటుంటారు. ఈ పరిస్థితినే పికా ఈటింగ్ డిజార్డర్ అని కూడా అంటారు. క్రమంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడతారు కూడా. పిల్లలకు టీ ఇవ్వడం వల్ల అందులోని కెఫిన్ వారి నిద్రకు భంగం కలిగిస్తుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం పిల్లలకు 12 సంవత్సరాల వయస్సు వచ్చేంతవరకు టీ ఇవ్వకూడదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 12 సంవత్సరాల తర్వాత కూడా అప్పుడప్పుడు మాత్రమే చాలా తకువ పరిమాణంలో ఇవ్వాలని గుర్తు పెట్టుకోండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Childrens
- Iron
- life style
- tea
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

