Interior Design | కొన్ని ఇళ్లను చూడగానే.. చుట్టాలమైపోయి.. పండ్లూ పూలూ కొనుక్కుని.. సూట్కేస్తో ఆ గడపలో కాలుపెట్టాలనిపిస్తుంది. మహారాష్ట్ర శివారు గ్రామంలో అలాంటి ఓ ఇంటిని తీర్చిదిద్దారు అమృతా కరుణాకర్ అనే ఇంటీరియర్ డిజైనర్. కూలిపోడానికి సిద్ధంగా ఉన్న తరాల నాటి భవంతి నుంచి ద్వారాన్నీ, ద్వారబంధాన్ని సేకరించారు.
యాంటిక్ దుకాణాల నుంచి జాడీలు, ఇత్తడి పాత్రలు, పాత పెయింటింగ్స్ తెప్పించారు. పునాదులు ఏ ఇంజినీర్ అయినా వేస్తాడు. గోడలూ, పైకప్పులూ ఏ మేస్త్రీ అయినా కడతాడు. ఇంటికి ప్రాణం పోయడం మాత్రం కొందరివల్లే అవుతుంది. అప్పుడే ఆ ఇల్లు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు అవుతుంది.