ఇంట్లో బొద్దింకలు ఉంటే చూసేందుకే చాలా అసహ్యం వేస్తుంది. వాటివల్ల రకరకాల వ్యాధులు కూడా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా వంటగది, బాత్రూమ్లలో వీటి బెడద ఎకువగా ఉంటుంది. ఈ బొద్దింకల పీడ విరగడ కోసం మారెట్లో దొరికే స్ట్రాంగ్ కెమికల్ స్ప్రేలు వాడుతుంటారు. కానీ, వాటి వాసన అందరికీ పడదు. పైగా అవి ఆరోగ్యానికి హానికరం. ఎటువంటి రసాయనాలు లేకుండా సహజ పద్ధతిలో బొద్దింకలను తరిమికొట్టే ఒక అద్భుతమైన చిటాను తెలుసుకుందాం..
నీరు: ఒక గ్లాసు, లవంగాలు: ఒక టేబుల్ స్పూన్
బిర్యానీ ఆకులు: రెండు
బేకింగ్ సోడా: ఒక టీస్పూన్
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. అందులో లవంగాలు, బిర్యానీ ఆకులు వేసి బాగా మరిగించాలి. నీటి రంగు మారిన తర్వాత, అందులో బేకింగ్ సోడా వేసి కలపాలి. ఈ ద్రావణం చల్లారిన తర్వాత, వడకట్టి ఒక స్ప్రే బాటిల్లో నింపుకోవాలి. బొద్దింకలు ఎకువగా తిరిగే ప్రాంతాలు అంటే.. సింక్ కింద, వంటగది మూలలు, డ్రైనేజీ పైపుల దగ్గర, చెత్తబుట్టల చుట్టూ ఈ నీటిని చల్లాలి.
రాత్రి పడుకునే ముందు ఈ స్ప్రేని వాడితే మరింత ఫలితం ఉంటుంది. లవంగాలు, బిర్యానీ ఆకులకు ఒక రకమైన ఘాటైన వాసన ఉంటుంది. ఈ వాసన బొద్దింకలకు అస్సలు పడదు. ఈ స్ప్రే చల్లిన ప్రాంతాల నుంచి అవి త్వరగా పారిపోతాయి. ఇది పూర్తిగా సహజమైనది కాబట్టి ఇంట్లో పిల్లలకు, పెంపుడు జంతువులకు ప్రమాదం ఉండదు.