Health Tips | ఆస్తమాతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీకు చక్కని పరిష్కారం..!
Health Tips | దీర్ఘకాలిక రోగాల బారినపడకుండా ఉండాలన్నా.. ఇప్పటికే అలాంటి రోగాలు ఉన్నవాళ్లు వ్యాధిని అదుపులో పెట్టుకోవాలన్నా బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ రోజుల్లో బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు సర్వసాధారణమయ్యాయి. అయితే అలాంటి దీర్ఘకాలిక రోగాల బారినపడకుండా ఉండాలన్నా.. ఇప్పటికే అలాంటి రోగాలు ఉన్నవాళ్లు వ్యాధిని అదుపులో పెట్టుకోవాలన్నా బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యులు చెప్పినట్లే బాధితులు కూడా అవసరమైన జాగ్రత్తలు పాటిస్తున్నారు. తాజాగా వైద్యులు బ్రౌన్ షుగర్ కూడా ఆరోగ్యానికి మంచిదని రిఫర్ చేస్తున్నారు. మరి బ్రౌన్ షుగర్‌లో ఉన్న ఆ సుగుణాలేమిటో ఒకసారి తెలుసుకుందామా..?
బ్రౌన్ షుగర్‌తో ప్రయోజనాలు..
1. బ్రౌన్ షుగర్‌ను చెరుకు నుంచి కాకుండా నేరుగా బెల్లం నుంచి సేకరిస్తారు. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, జింక్, రాగి, భాస్వరం, విటమిన్ బి-6 వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ, వైట్ షుగర్ తీసుకోవడంవల్ల కేలరీలు పెరుగుతాయి. దానివల్ల బరువు కూడా పెరిగే ప్రమాదం ఉంది.
2. బ్రౌన్ షుగర్ తీసుకోవడంవల్ల జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. దాంతో మలబద్దకం సమస్య కూడా తీరిపోతుంది. అందుకోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అల్లం ముక్క, ఒక టీస్పూన్ బ్రౌన్ షుగర్ కలిపి తీసుకోవాలి.
3. అదేవిధంగా శరీరంలో తిమ్మిర్లను తగ్గించడానికి కూడా బ్రౌన్ షుగర్ సహాయపడుతుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి కాళ్లు, చేతుల్లో తిమ్మిరితోపాటు నొప్పిని కూడా తగ్గిస్తుంది.
4. బ్రౌన్ షుగర్‌లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి కూడా ఇది తోడ్పడుతుంది. అలాగే జీవక్రియలను మెరుగుపరుస్తుంది. బ్రౌన్ షుగర్‌లో విటమిన్ బి6, నియాసిన్, పాంతోతేనిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం కోసం యాంటీ ఏజింగ్ కాంపోనెంట్గా పనిచేస్తాయి. చర్మంపై మృత కణాలను తొలగించే స్క్రబ్‌గా పనిచేస్తాయి.
5. బ్రౌన్ షుగర్ యాంటీ అలెర్జీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అందుకే ఇది ఉబ్బసం రోగులకు చేసే చికిత్సలో సహాయపడుతుంది. అదేవిధంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను బ్రౌన్ షుగర్ కలిగి ఉంటుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

