తరచూ కడుపుబ్బరం సమస్య వేధిస్తున్నదా.. అయితే మీ వంటల్లో ఇది తప్పక ఉండాల్సిందే..
Health tips | ఇంగువ..! ఇదొక ఘాటైన సుగంధ ద్రవ్యం..! పొడిగాగానీ, ముద్దగాగానీ రెండు రకాలుగా ఇది లభ్యమవుతుంది..! ఈ ఇంగువతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..! ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఇది వంటలకు మంచి సువాసనను కూడా ఇస్తుంది.
Health tips | ఇంగువ..! ఇదొక ఘాటైన సుగంధ ద్రవ్యం..! పొడిగాగానీ, ముద్దగాగానీ రెండు రకాలుగా ఇది లభ్యమవుతుంది..! ఈ ఇంగువతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..! ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఇది వంటలకు మంచి సువాసనను కూడా ఇస్తుంది. పప్పు, పప్పుచారు, పులిహోరతోపాటు వివిధ రకాల నిలువ తొక్కుల్లో కూడా ఇంగువను వాడుతారు. ఈ ఇంగువను వాడటంవల్ల ఆహారం చెడిపోకుండా కూడా ఉంటుంది. ఇవేగాక, ఇంగువతో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట. మరి అవేంటో తెలుసుకుందామా..
ఇంగువతో ప్రయోజనాలు..
1. ఇంగువను క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
2. ఇంగువ పొడిలో యాంటీ బయాటిక్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శ్వాస సమస్యల పరిష్కారానికి తోడ్పడుతాయి.
3. మహిళలకు నెలసరి సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి నుంచి కూడా ఇంగువ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అందుకోసం మహిళలు బెల్లంతో బఠానీ గింజంత ఇంగువ పెట్టుకుని తినాలి.
4. తరచూ తలనొప్పితో బాధపడేవాళ్లు ఒక కప్పు మరిగించిన నీళ్లలో చిటికెడు ఇంగువ వేసి రోజుకు రెండు మూడుసార్లు తాగితే మాయమవుతుంది.
5. పిల్లలకు కడుపులో నులి పురుగులు ఉంటే సెనగ గింజంత ఇంగువను వాము, బెల్లంతో కలిపి తినిపించాలి. మంచి ప్రయోజనం ఉంటుంది.
6. రోజూ భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దను నెయ్యి, వాము, ఇంగువను కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలు తీరిపోతాయి.
గమనిక: అయితే ఇంగువను పరిమితంగా వాడితేనే ప్రయోజనకారిలా పనిచేస్తుంది. అతిగా తీసుకుంటే విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

