కంఫర్ట్‌లో తిరుగులేదు.స్టైల్ లో ఎదురు లేదు. హ్యాండ్లూమ్ లినెన్ టిష్యూ చీర ప్రత్యేకతే వేరు. వస్త్ర సౌకుమార్యం గులాబీ రేకులను తలపిస్తుంది. కట్టుకోగానే ఆకాశంలో తేలిపోతున్న అనుభూతినిస్తుంది. ఇక బ్లౌజ్ గురించి చెప్పేదేముంది? స్టేట్మెంట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ‘ఐయామ్ సో స్పెషల్’ అని ప్రకటిస్తున్నది. మణికట్టు వరకూ డిజైన్ చేసిన స్లీవ్స్.. వావ్ అనిపిస్తున్నాయి. మెడలోని బో టై.. అందానికి గజమాల వేసినట్టు ఉంది.