Life style | ఏది కల్తీ.. ఏది హెల్దీ..?.. కల్తీ నూనెను కనిపెట్టడం ఎలా..?
Life style | పండుగొచ్చిందంటే నూనెలు తెగ కాగాల్సిందే! శుద్ధమైన పల్లీనూనె సలసల మసులుతుంటే... ఆ పరిమళం వాడకట్టునంతా కట్టిపడేస్తుంది. కానీ కల్తీ నూనెలు రాజ్యమేలడం మొదలయ్యాక ఆ సువాసనలు మాయమైపోయాయి. తిరగమోతలో రుద్రాక్ష పరిమాణంలో ఇంగువ వేసినా..
పండుగొచ్చిందంటే నూనెలు తెగ కాగాల్సిందే! శుద్ధమైన పల్లీనూనె సలసల మసులుతుంటే… ఆ పరిమళం వాడకట్టునంతా కట్టిపడేస్తుంది. కానీ కల్తీ నూనెలు రాజ్యమేలడం మొదలయ్యాక ఆ సువాసనలు మాయమైపోయాయి. తిరగమోతలో రుద్రాక్ష పరిమాణంలో ఇంగువ వేసినా.. వాసన వంటింటి గుమ్మం దాటకుండా తయారైంది. దీనికంతటికీ కల్తీ నూనే కారణం. అయితే ఏది మంచి నూనో, ఏది కల్తీ నూనో కనిపెట్టడం బ్రహ్మవిద్యేం కాదు. చిన్నచిన్న చిట్కాలతో ఇట్టే తెలుసుకోవచ్చు.
ఒక తెల్ల కాగితం తీసుకొని.. కొద్దిగా నూనె వేసి ఆరబెట్టాలి. నూనె స్వచ్ఛమైనది అయితే.. అది వృత్తంలాగా వ్యాపిస్తుంది. అదే నకిలీదైతే పేపర్‌పై పూర్తిగా ఇంకిపోకుండా పక్క దారులకు పాకుతుంది.
ఒక గిన్నెలో కొంచెం నూనె పోసి ఫ్రీజర్‌లో ఉంచాలి. స్వచ్ఛమైన
నూనైతే ఘనీభవిస్తుంది. కల్తీదైతే అలాగే ద్రవరూపంలో ఉంటుంది. స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ ఫ్రీజర్‌లో ఉంచితే 30 నిమిషాల్లో గడ్డ కడుతుంది. అలా కాలేదంటే… దాల్ మే కుచ్ కాలాహై అనుకోవచ్చు!
స్వచ్ఛమైన పల్లీనూనె సువాసన కలిగి ఉంటుంది. కల్తీదైతే.. కాస్త చేదు వాసన వస్తుంటుంది. అంతేకాదు కల్తీనూనె కాస్త చిక్కగా ఉంటుంది. ఈ విషయాలు పరిశీలించి కల్తీనూనె బారినపడకుండా జాగ్రత్తపడండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- groundnut oil
- Oil
- palm oil
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

