బ్రౌజర్లో పదుల సంఖ్యలో ట్యాబ్స్ ఓపెన్ చేస్తారా? ఏ ట్యాబ్‌లో ఏముందో తెలియక, చిన్నగా అయిపోయిన ట్యాబ్స్‌ని వెతుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారా? గూగుల్ క్రోమ్ ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పెట్టబోతున్నది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో పాపులర్ అయిన ‘వర్టికల్ ట్యాబ్స్’ ఫీచర్‌ను గూగుల్ ఇప్పుడు తన క్రోమ్ బ్రౌజర్‌లోకి తీసుకొస్తున్నది. ఇకపై మీ ట్యాబ్స్ అన్నీ స్క్రీన్‌కి ఎడమ వైపు వరుసగా కనిపిస్తాయి.
సాధారణంగా మనం ట్యాబ్స్‌ని స్క్రీన్ పైభాగంలో చూస్తాం. కానీ, వర్టికల్ ట్యాబ్స్‌లో అవి పక్క పక్కనే లిస్ట్‌లా కనిపిస్తాయి. దీంతో వెడల్పుగా ఉండే మానిటర్లు, కంప్యూటర్ స్క్రీన్లను మనం మరింత సమర్థంగా వాడుకోవచ్చు. ట్యాబ్ పేరు పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి, మనం ఏ వెబ్సైట్లో ఉన్నామో వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ వర్టికల్ ట్యాబ్స్ మన డిజిటల్ వర్క్ ఫ్లోను మరింత క్రమబద్ధం చేస్తాయి.
క్లటర్ ఫ్రీ డిజైన్: ట్యాబ్స్ అన్నీ పక్కన ఉండటం వల్ల పైభాగం ఖాళీగా ఉండి, వెబ్సైట్ కంటెంట్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
ఈజీ మేనేజ్మెంట్: ట్యాబ్స్‌ని గ్రూప్ చేయడం, వెతకడం.. అంతేకాదు, క్రమ పద్ధతిలో అమర్చుకోవడం ఇప్పుడు మరింత సులభం.
కొలాప్సిబుల్ సైడ్బార్: మీకు అవసరం లేనప్పుడు ఆ సైడ్బార్ని లోపలికి నెట్టేయవచ్చు, కేవలం ఐకాన్లు మాత్రమే కనిపిస్తాయి. దీనివల్ల స్క్రీన్ స్పేస్ ఆదా అవుతుంది.
మెమొరీ సేవర్కి తోడుగా: క్రోమ్ ఇప్పటికే ప్రవేశపెట్టిన ‘మెమొరీ సేవర్’తో కలిపి ఈ వర్టికల్ ట్యాబ్స్‌ని వాడితే బ్రౌజింగ్ స్పీడ్ అద్భుతంగా ఉంటుంది.
ప్రస్తుతం ఇది ‘క్రోమ్ కానరీ’ (Chrome Canary) వెర్షన్లో టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే సాధారణ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. క్రోమ్ సెట్టింగ్స్ లోని Appearance విభాగంలో లేదా ట్యాబ్ సెర్చ్ పక్కన ఉండే బటన్ ద్వారా దీన్ని ఆన్ చేసుకోవచ్చు. డిజిటల్ ప్రపంచంలో మనం ఎంత వేగంగా సమాచారాన్ని సేకరిస్తున్నాం అన్నది మన ‘ఆర్గనైజింగ్ స్కిల్స్’ మీద ఆధారపడి ఉంటుంది. క్రోమ్ తీసుకొస్తున్న ఈ వర్టికల్ ట్యాబ్స్ ఫీచర్.. మల్టీ టాస్కింగ్ చేసే ప్రొఫెషనల్స్‌కి ఒక వరం లాంటిది. ఒకసారి ట్రై చేసి చూడండి.. మీ బ్రౌజింగ్ైస్టెల్ మారిపోవడం ఖాయం!