మేకపాలు సహజ మాయిశ్చరైజర్లా పనిచేస్తాయి. పైగా చర్మంలోకి ఇంకి పోతాయి. అలా చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచుతాయి. మనిషి చర్మంలో ఉండే పీహెచ్ స్థాయులే మేకపాలలో ఉంటాయి. అంటే మేకపాల వల్ల చర్మం తన సహజత్వాన్ని ఏమాత్రం కోల్పోదన్నమాట! సోరియాసిస్, గజ్జి లాంటి చర్మవ్యాధుల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. మేకపాలలో లాక్టిక్ ఆమ్లం ఎక్కువ. ఇది చర్మంపై తేమ నిలిచిపోయేలా చేస్తుంది. ముఖంపై మొటిమలు, మచ్చలనూ నివారిస్తాయి.