కాంక్రీట్ జంగిల్ నుంచి దూరంగా పారిపోవాలని కోరుకోనివారు ఎవరు? అది అత్యాశ అయినప్పుడు, ఇంటినే బృందావనంగా మార్చేసుకోవచ్చు. పచ్చటి తోరణం (గార్డెన్ ఆర్చ్) నిర్మించుకోవచ్చు. వీటితో పెరడుకైనా, వాకిలికైనా అందం వస్తుంది. నిర్మాణం కూడా సులభమే.
లోహపు తోరణం: మెటల్ ఆర్చ్ దృఢంగా ఉంటుంది. కావాల్సిన ఆకారంలో లభిస్తుంది. చెమ్మకు పాడయ్యే ప్రమాదం ఉండదు. తీగలను కూడా సులువుగా పాకించవచ్చు.
కలప తోరణం: సంప్రదాయ రీతిలో నిర్మించిన ఇంటికి చెక్క ఆర్చ్తో మరింత వన్నె వస్తుంది. దీనికి జాజిలాంటి మొక్కలను జతచేస్తే గుబాళింపు ఖాయం.
ప్లాస్టిక్ తోరణం: తక్కువ ఖర్చుతో, అంతే తక్కువ బరువుతో పని కావాలంటే ప్లాస్టిక్ ఆర్చ్ ఓ మంచి అవకాశం. ఫెర్న్ తరహా మొక్కలకు అనుకూలం.
వెదురు తోరణం: పర్యావరణ హితమే కాదు, బరువైన మొక్కలను భరించేంత దృఢంగానూ ఉంటుంది. సహజమైన అందాన్ని ఇస్తుంది.