Health Tips | ఎలాంటి ఖర్చు లేకుండా శారీరక, మానసిక సమస్యలకు ఇలా చెక్ పెట్టేయొచ్చు
Health Tips | శారీరక ఆనందంతోపాటు మానసిక ఉల్లాసాన్ని అందించేది కళ. చక్కని సంగీతం హాయినిస్తుంది. అలాగే నృత్యం, చిత్రకళ, ఇతర లలిత కళలు మనిషి ఎదుగుదలకు దోహదం చేస్తాయి. జ్ఞ్ఞానేంద్రియాలను ప్రేరేపించే ఈ కళలతో మనసుకు కూడా ప్రశాంతత చేకూర్చవచ్చంటున్నారు నిపుణులు.
Health Tips | శారీరక ఆనందంతోపాటు మానసిక ఉల్లాసాన్ని అందించేది కళ. చక్కని సంగీతం హాయినిస్తుంది. అలాగే నృత్యం, చిత్రకళ, ఇతర లలిత కళలు మనిషి ఎదుగుదలకు దోహదం చేస్తాయి. జ్ఞ్ఞానేంద్రియాలను ప్రేరేపించే ఈ కళలతో మనసుకు కూడా ప్రశాంతత చేకూర్చవచ్చంటున్నారు నిపుణులు. అందుకే వీటిని థెరపీలుగా కూడా ఉపయోగిస్తున్నారు. తద్వారా శారీరక, మానసిక సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతున్నారు.
సంగీత సాధన
శ్రావ్యమైన సంగీతం వింటే తెలియకుండానే మనసు తేలికపడుతుంది. జర్నల్ ఆఫ్ మ్యూజిక్ థెరపీలో ప్రచురితమైన ఓ పరిశోధన ప్రకారం ఆందోళన, దీర్ఘకాలిక బాధలు, నొప్పుల నుంచి సంగీతంతో ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు నచ్చిన గాయకుల పాటలు వినడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది.
కళతో భళా!
ఆర్ట్ థెరపీ ఒకరకమైన మానసిక చికిత్స. మానసిక అనారోగ్యాన్ని సరిచేయడానికి, ఆందోళన, నిరాశ తగ్గించడానికి ఈ థెరపీ ఉపయోగిస్తారు. క్యాన్సర్‌తోపాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే రోగులకు ఆర్ట్ థెరపీ చక్కని ఔషధం. బొమ్మలు గీయడం, వాద్య పరికరాలు, సంగీతం సాధనచేయడంతో శారీరక రుగ్మతను జయించిన వాళ్లు ఎందరో ఉన్నారు. వైద్యానికి అనుబంధంగా ఆర్ట్ థెరపీ తీసుకుంటే.. ఫలితం మెరుగ్గా ఉంటుందని నిపుణుల మాట.
స్టెప్పేస్తే..
డ్యాన్స్ ఉరిమే ఉత్సాహాన్ని ఇస్తుంది. నృత్యాన్ని చూసినా, చేసినా మానసికంగా మేలైన మార్పు కలుగుతుంది. నృత్యం వల్ల కలిగే శారీరక శ్రమ ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కూడా డ్యాన్స్ థెరపీ ఒక మార్గం. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు స్టెప్పేస్తే… అనారోగ్యం తోకముడవడం ఖాయం.
నలుగురితో కలిసి
నలుగురితో కలివిడిగా ఉండటం, మనసులో మాట పంచుకోవడాన్ని పబ్లిక్ ఆర్ట్ అంటారు. జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. నచ్చిన ప్రదేశంలో, ఇష్టమైన మనుషుల మధ్య గడపడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందట. మానసిక ఆరోగ్యం బాగాలేనప్పుడు విహారానికో, యాత్రలకో వెళ్లమని వైద్యులు సూచించడం వెనుక ఆంతర్యం కూడా ఇదే!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- Games
- Health
- health tips
- songs
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

