మలయాళ చిత్రం ‘గ్రేట్ ఇండియన్ కిచెన్’ చూసిన ఎవరికైనా నిమిష సజయన్ గుర్తుండే ఉంటుంది. చామనఛాయ, కుదురైన ఆకృతి, నటన తెలిసిన నేత్రాలు ఆమె ప్రత్యేకత. ముంబైలో పుట్టిపెరిగినా మలయాళంలో మలయమారుతం సృష్టించింది. తమిళంలోనూ నటిస్తున్నది. తెలుగు తెర కూడా ఆమె వైపు ఆశగా చూస్తున్నది. ఓ ఫ్యాషన్ షూట్లో తన ముస్తాబు ఇది.