సంప్రదాయ వంటలే మేలట!
ఒబెసిటీ గురించి విన్నప్పుడు మొదటగా గుర్తుకొచ్చేది అమెరికన్లే. వాళ్లలో 43 శాతం మంది ఆ సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి వల్ల ఇండియాలో కూడా ఒబెసిటీ బాధితులు పెరుగుతున్నారు.
ఒబెసిటీ గురించి విన్నప్పుడు మొదటగా గుర్తుకొచ్చేది అమెరికన్లే. వాళ్లలో 43 శాతం మంది ఆ సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి వల్ల ఇండియాలో కూడా ఒబెసిటీ బాధితులు పెరుగుతున్నారు. దాని నుంచి తప్పించుకునే దారిలేదా? అనేవాళ్లకు కనిపించే దేశం జపాన్. ఆ దేశంలో అధిక బరువుతో ఉండేవారు ఆరు శాతం మంది మాత్రమే! అంత తక్కువమంది ఒబెసిటీ రోగులు ఉండడానికి కారణం వాళ్ల జీవనశైలే.
జపాన్ వాళ్లేమీ ఒబెసిటీని తప్పించుకోవడానికి ప్రత్యేక చర్యలేవీ చేపట్టడం లేదు. వీరికి సంప్రదాయ ఆహారమే ఇష్టం. సామాన్యుడే కానీ, సంపన్నుడే కానీ కాస్త నడవడం జపాన్ జీవనశైలిలో భాగం. కారు ఉన్నా సరే, చిన్నచిన్న పనుల కోసం నాలుగడుగులు వేస్తారు. ప్రాసెస్ చేసిన ఆహారం తినేవాళ్లు చాలా తక్కువ. తినే ఆహారంలో ప్రొటీన్, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా భోజనాన్ని సిద్ధం చేసుకుంటారు.
ఈ సమతుల్యతే జపాన్ వాళ్లను ఒబెసిటీ నుంచి కాపాడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు, ట్రెండ్స్ వచ్చినా జపాన్ వాళ్లు సంప్రదాయ జీవనశైలిని విస్మరించలేదు. అదే వాళ్లను ఒబెసిటీ నుంచి కాపాడుతున్నది. అందుకు భిన్నంగా అమెరికా వాళ్లు ప్రాసెస్ చేసిన, ప్యాక్డ్ ఆహారానికి ఎక్కువగా అలవాటుపడ్డారు. ఈ రెండు దేశాలనూ చూసిన తర్వాత మనకు అర్థం అయ్యేదేమిటంటే.. స్థానిక పంటలు, సంప్రదాయ వంటలే మేలని. ‘ఆ రోజుల్లో అలా తినేవాళ్లు.. అంత బలంగా ఉండేవాళ్లు’ అంటూ పెద్దలు చెప్పే ముచ్చట్లను కొట్టిపారేయకుండా.. మన శరీరానికి కావాల్సిన ఆహారాన్ని సమపాళ్లలో ఎంచుకున్న రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంప్రదాయ రుచులు ఆరగిద్దాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

