కలలు ఎన్ని రకాలు?.. అవి ఎందుకు వస్తాయి?
కలలు | స్వప్నశాస్త్రం ప్రకారం.. మనకు నిద్రలో వచ్చే కలలు మూడు రకాలు. అవి ‘చింతజములు’, ‘వ్యాధిజములు’, ‘యాదృచ్ఛికములు’.

స్వప్నశాస్త్రం ప్రకారం.. మనకు నిద్రలో వచ్చే కలలు మూడు రకాలు. అవి ‘చింతజములు’, ‘వ్యాధిజములు’, ‘యాదృచ్ఛికములు’. ఏదైనా విషయం గురించి పదేపదే ఆలోచిస్తే దానికి సంబంధించిన స్వప్నం వస్తుంది. అలాంటి వాటిని ‘చింతజములు’ అంటారు. జ్వరం, ఇతర రుగ్మతలకు గురైనప్పుడు మానసికంగా ఆందోళన కారణంగా కొన్ని కలలు వస్తుంటాయి. ఇవి ‘వ్యాధిజములు’. ఈ రెండు రకాల స్వప్నాలు భవిష్యత్తుకు సూచికలు కావు.
మన ఆలోచనతో సంబంధం లేకుండా కాకతాళీయంగా వచ్చేవి ‘యాదృచ్ఛికములు’. వీటిలో కొన్ని భవిష్యత్తును సూచిస్తాయని స్వప్నశాస్త్రం చెబుతున్నది. అయితే, రాత్రి మొదటిజాములో అంటే అర్ధరాత్రి కన్నాముందే వచ్చే కలలు పాతిక శాతం, రెండో జాములో (అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాములోపు) వచ్చే కలలు 50 శాతం, మూడో జాములో (తెల్లవారు జాము నుంచి తెల్లవారే లోపు) వచ్చే కలలు 95 శాతం నిజమవుతాయని స్వప్నశాస్త్రం చెబుతున్నది. అయితే ఈ సమయంలో వచ్చే కలలు అన్నీ నిజమవుతాయని శాస్ర్తాలలో ఎక్కడా పేర్కొనలేదు.
సుస్వప్నాలు: మేడలు, పర్వతాలు, ఫలవృక్షాలు, రథం, గుర్రాలు, ఏనుగులను చూడటం, వాటిని అధిరోహించడం. ఎద్దు, ఆవు, పూలు, గోక్షీరం, కన్య, రత్నాలు, ముత్యాలు, శంఖం, దేవతా విగ్రహాలు, చందనం, పుణ్యస్థలాలు చూసినా, పాలు, పెరుగు, తేనె, భక్ష్యాలు తిన్నట్టు కలవచ్చినా శ్రేష్ఠం. పట్టువస్ర్తాలు, ఆభరణాలు ధరించడం తదితర స్వప్నాలు శుభఫలాల్ని ఇస్తాయని శాస్త్రం చెబుతున్నది.
దుస్వప్నాలు: పాములు వంటి విషజీవాలు, పులులు వంటి క్రూర మృగాలు, ఇనుము, పత్తి. కూలిన మేడలు చూసినా, ఇల్లు కూలినట్లు, బురదలో కూరుకుపోయినట్టు, మోదుగ చెట్టు ఎక్కినట్టు, నక్షత్రం పడిపోతున్నట్టు చూసినా, బావిలో పడినట్టు, పిచ్చివారు ఎదురుపడినా, శరీరానికి నూనె రాసుకున్నా, ఎవరో లాక్కొని పోయినట్టు కలలు కంటే నష్టం వాటిల్లుతుందని శాస్త్రం చెబుతున్నది.
ఇవికూడా చదవండి
రోజూ తినే ఆహారంలో ఇవి ఉంటే ఆరోగ్యం మీ వెంటే
ఉగాది పచ్చడి వల్ల కలిగే ప్రయోజనాలు?
కీరదోస తింటే 7 రోజుల్లో 7 కిలోల బరువు తగ్గుతారా?
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- dreams
- Health news
- lifestyle
RELATED ARTICLES
తాజా వార్తలు
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

