Health tips | నిద్రలేమి సమస్య మిమ్మల్ని చికాకు పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే
Health tips | నిద్ర సరిగా లేకపోవడంతో అనారోగ్య సమస్యలు దాపురిస్తాయి. అయితే కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..?
నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం. కంటినిండా నిద్రపోతే మనసు, శరీరం హాయిగా ఉంటాయి. అయితే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వాటి మూలంగా పెరిగే ఒత్తిడి మనిషిని మానసిక ఆందోళనకు గురిచేస్తాయి. ఇలాంటి సమస్యలను కొందరు భరించగలిగినా కొంతమంది మాత్రం తీవ్ర వ్యాకులతకు గురవుతారు. దాంతో వారికి సరిగ్గా నిద్రపట్టదు. నిద్ర సరిగా లేకపోవడంతో అనారోగ్య సమస్యలు దాపురిస్తాయి. అయితే కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..?
కంటినిండా నిద్ర కోసం..
అశ్వగంధ: అశ్వగంధ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా దీనివల్ల అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అశ్వగంధ సహజంగా ట్రై ఎథిలిన్ గ్లైకాల్‌ను కలిగి ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపర్చడంలో తోడ్పడుతుంది. మంచి నిద్ర కోసం మీరు పడుకోవడానికి 30 నిమిషాలు ముందు అశ్వగంధను తీసుకోవచ్చు.
బాదాం: బాదాంలో ఫైబర్, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బాదాంలో మెగ్నీషియం ఉంటుంది. నిద్ర సహాయక కారకం అయిన మెలటోనిన్ నియంత్రణకు మెగ్నీషియం అవసరం. మెగ్నీషియం మీ కండరాలను కూడా సడలింపజేస్తుంది. ఫలితంగా నిద్ర బాగా పడుతుంది.
జాజికాయ పాలు: ఒక గ్లాసు పాలలో చిటికెడు జాజికాయ కలిపి తీసుకోవడంవల్ల నిద్ర మెరుగుపడుతుంది. పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది శరీరంలో సెరటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఈ రెండూ మంచి నిద్రకు తోడ్పడుతాయి.
గుమ్మడి గింజలు: గుమ్మడి గింజలను పెపిటాస్ అని కూడా అంటారు. వీటిలో ట్రిప్టోఫాన్తోపాటు జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండూ సెరటోనిన్‌ను ఉత్పత్తిలో సహాయపడతాయి. సెరటోనిన్ నిద్రను మెరుగుపరుస్తుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

