కుండీలు చూసి కొనండి
పెరటి తోటల్లో కుండీలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే, వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన కుండీని ఎంచుకున్నప్పుడే.. మొక్కలకు ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రస్తుతం టెర్రకోట, సిమెంట్, ప్లాస్టిక్.. మూడు రకాల్లో ఇవి లభిస్తున్నాయి. వీటితో కలిగే ప్రయోజనాలు, వీటి మధ్య తేడాలను తెలుసుకున్నప్పుడే.. దేన్ని కొనుగోలే చేయాలో అర్థమవుతుంది.
టెర్రకోట (మట్టి) కుండీలు
మొక్కలు ఆరోగ్యంగా పెరగడంతోపాటు పర్యావరణానికీ మేలు చేయడంలో టెర్రకోట కుండీలు ముందుంటాయి. ఇవి గాలి బాగా ఆడేలా ఉంటాయి. కాబట్టి వేర్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. అదనపు తేమను ఇవి పీల్చుకుంటాయి. దాంతో వేర్లు కుళ్లిపోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. కానీ, ఇవి పగిలిపోయే అవకాశం ఎక్కువ. ఎండలో ఉంచినప్పుడు నీరు త్వరగా ఆవిరైపోతుంది. కాబట్టి, తరచుగా నీరు పోయాల్సి వస్తుంది. కాక్టస్, సక్యూలెంట్స్ లాంటి నీరు తక్కువగా అవసరమయ్యే మొక్కలకు ఇవి బాగా సూటవుతాయి.
సిమెంట్ కుండీలు
ఇవి చాలా బలంగా ఉంటాయి. అవుట్ డోర్లో పెంచే పెద్ద మొక్కలకు బాగా సరిపోతాయి. చాలాకాలం మన్నుతాయి. మట్టి కుండీలతో పోలిస్తే.. ఎక్కువసేపు చల్లదనాన్ని పట్టి ఉంచుతాయి. కానీ, సిమెంట్ కుండీలు బరువుగా ఉంటాయి. పదేపదే మార్చడం కష్టం అవుతుంది. కొత్తగా కొనే సిమెంట్ కుండీల్లో ఉండే సున్నం.. కొన్నిరకాల మొక్కలకు హాని కలిగిస్తుంది. ఇంటి బయట, బాల్కనీలో పెద్దపెద్ద మొక్కలు, పొదలు, దీర్ఘకాలం ఉండే మొక్కలకు ఇవి అనుకూలంగా ఉంటాయి.
ప్లాస్టిక్ కుండీలు
ఆధునిక గార్డెనింగ్‌లో ఎక్కువగా కనిపించేవి ప్లాస్టిక్ కుండీలే! చాలా తేలికగా, ఆకర్షణీయమైన డిజైన్లలో లభిస్తాయి. నీటిని ఎక్కువసేపు నిలిపి ఉంచుతాయి. కాబట్టి తక్కువగా పోసినా సరిపోతుంది. కానీ, ఈ కుండీల్లో గాలి ఆడే అవకాశం తక్కువగా ఉంటుంది. నాసిరకం ప్లాస్టిక్ అయితే.. త్వరగా పాడైపోతాయి. వేసవిలో త్వరగా వేడెక్కి.. వేర్లకు ఇబ్బంది కలిగిస్తాయి. ఇండోర్ మొక్కలకు, హ్యాంగింగ్ ప్లాంట్స్, నీరు ఎక్కువగా కావాల్సిన మొక్కలకు ఇవి బాగుంటాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

