Life Style | పెయిన్ డైరీ.. ఇలాచేస్తే మానసికమైన బాధల నుంచి ఉపశమనం పొందొచ్చు!
రోజువారీ జీవితంలో ఆందోళనలకు గురవుతున్నారా... ఒత్తిడి మీ జీవితాన్ని చిత్తు చేస్తున్నదా... అయితే ఈ డైరీ గురించి తెలుసుకోవాల్సిందే. సాధారణంగా శారీరక ఇబ్బందుల తీవ్రతను తెలుసుకోడానికి వాడే ఈ డైరీ.. మానసికమైన బాధలను కొలిచేందుకు, తద్వారా ఉపశమనం పొందేందుకు కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Life Style | రోజువారీ జీవితంలో ఆందోళనలకు గురవుతున్నారా… ఒత్తిడి మీ జీవితాన్ని చిత్తు చేస్తున్నదా… అయితే ఈ డైరీ గురించి తెలుసుకోవాల్సిందే. సాధారణంగా శారీరక ఇబ్బందుల తీవ్రతను తెలుసుకోడానికి వాడే ఈ డైరీ.. మానసికమైన బాధలను కొలిచేందుకు, తద్వారా ఉపశమనం పొందేందుకు కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా డిప్రెషన్‌లాంటి సమస్యలతో బాధ పడేవారు, తాము ఏ సందర్భంలో, ఏ సమయంలో ఎక్కువ బాధకు గురవుతున్నారు, ఆ బాధ కలగడానికి కారణమైన అంశాలేంటి, అసలు ఆ రోజు మొత్తంగా మూడ్ ఎలా ఉంది.. ఇలా వివిధ అంశాలను ఈ పెయిన్ డైరీలో పొందుపరచాలి.
ఇవాళ సంతోషకరమైన రోజు, బాధా కరమైన రోజు, ఫర్వాలేదు.. ఇలా ప్రతిరోజునూ టిక్ చేయడం వల్ల లేదా వివిధ రంగులను వాడి తమ మూడ్‌ను డైరీలో ప్రతిబింబించడం వల్ల కొద్ది రోజులు గడిచేసరికి అసలు జీవితం ఎలా సాగుతున్నది అనే సమాచారం ఒక చోట దొరుకుతుంది. ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం, ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, పదేపదే ఒకేపని చేస్తున్నామా… లాంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా మనసును ఇబ్బంది పెట్టేవాటిని దూరం పెట్టి, కెరీర్ మీద దృష్టి పెట్టే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా మానసికంగా మెరుగుపడవచ్చని చెబుతున్నారు సైకాలజిస్టులు. సాదా నోట్‌బుక్ లేదా ప్రత్యేకమైన డైరీల్లోనూ వీటన్నిటినీ పొందుపరచుకోవచ్చు. మనసును బాధించే నొప్పుల నుంచి బయటపడొచ్చు. మానసికమైనదైనా నొప్పి నొప్పే కదా మరి!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

