బెంగాల్.. చిత్రకళకు కాణాచి. మహిళను అందంగా, హుందాగా చిత్రించడం అక్కడి చిత్రకారులకు బాగా తెలుసు. చేతిలో వాద్యపరికరంతో, సంప్రదాయ అలంకరణలతో చూడముచ్చటగా ఉన్న ఈ పెయింటింగ్ పేరు ‘సుందరి’.
ఎవరో అజ్ఞాత చిత్రకారుడు ప్రాణంపోసినట్టు ఉన్నాడు. ఏ సుందరిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సుందరిలో జీవం నింపాడో మరి!