బెల్టెడ్ కేప్ ఫ్యాషన్ టాప్!
సాధారణంగా వదులుగా, గాల్లో తేలిపోయేలా ఉండే ‘కేప్ ష్రగ్'ల గురించి మనకు తెలిసిందే. అయితే ఈ సీజన్లో వీటికి కాస్త స్టయిలిష్ హంగులు అద్దారు డిజైనర్లు. అదే.. ‘బెల్టెడ్ కేప్' ట్రెండ్! వదులుగా ఉండే కేప్‌ను నడుము భాగంలో ఒక బెల్ట్‌తో ఫిట్ చేయడం ద్వారా లూజ్ ఫిట్టింగ్ కాస్తా పర్ఫెక్ట్ బాడీ షేప్‌గా మారిపోతుంది.
సాధారణంగా వదులుగా, గాల్లో తేలిపోయేలా ఉండే ‘కేప్ ష్రగ్’ల గురించి మనకు తెలిసిందే. అయితే ఈ సీజన్లో వీటికి కాస్త స్టయిలిష్ హంగులు అద్దారు డిజైనర్లు. అదే.. ‘బెల్టెడ్ కేప్’ ట్రెండ్! వదులుగా ఉండే కేప్‌ను నడుము భాగంలో ఒక బెల్ట్‌తో ఫిట్ చేయడం ద్వారా లూజ్ ఫిట్టింగ్ కాస్తా పర్ఫెక్ట్ బాడీ షేప్‌గా మారిపోతుంది. ఇటు వెస్ట్రన్ లుక్, అటు ట్రెడిషనల్ గ్రేస్ రెండూ ఒకేసారి అందించడం ఈ స్టయిల్ ప్రత్యేకత. ఒకే రంగున్న ప్యాంట్, క్రాప్ టాప్‌పైకి లాంగ్ ష్రగ్ వేసి, నడుముకి వెడల్పాటి లెదర్ బెల్ట్ పెడితే అదిరిపోయే ఇండో-వెస్ట్రన్ లుక్ మీ సొంతమవుతుంది. ఆఫీస్ పార్టీలకు ఇది పర్ఫెక్ట్. సంప్రదాయ ఇక్కత్, ఖాదీ లవర్స్‌కు కూడా ఈ ఫ్యాషన్ బాగా సూట్ అవుతుంది.
కాటన్ లేదా ఇక్కత్ ప్రింట్లు ఉన్న కేప్స్ వేసుకున్నప్పుడు, దానికి మ్యాచింగ్ బ్రౌన్ లేదా బ్లాక్ కలర్ క్లాసిక్ బెల్టులు జత చేస్తున్నారు. ఇది క్యాజువల్ లుక్‌ని కూడా ఫ్యాషనబుల్‌గా మారుస్తుంది. పెళ్లిళ్లు, పండుగలకు సిల్క్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు.. లెదర్ బెల్టుకి బదులు బంగారు లేదా వెండి రంగుల్లో వచ్చే ‘మెటాలిక్ చైన్ బెల్టులు’ (వడ్డాణం లాంటివి) వాడుతున్నారు. ఎత్తు కాస్త తక్కువగా ఉంటే, సన్నటి బెల్టులను ఎంచుకోండి. పొడవుగా ఉండేవారు వెడల్పాటి లెదర్ వాటితో మరింత రాయల్‌గా కనిపించవచ్చు.
ఈ ట్రెండ్ వల్ల లాభం ఏంటంటే.. ఇది మనల్ని స్లిమ్‌గా చూపించడమే కాకుండా, రోజంతా సౌకర్యవంతంగా ఉంచుతుంది. దుపట్టా సర్దుకునే ఇబ్బంది లేకుండా, ట్రెండీగా మెరిసిపోవాలనుకునే అతివలకు ఈ బెల్టెడ్ కేప్’ ఒక వండర్ఫుల్ చాయిస్. మీరూ ఒకసారి ట్రై చేసి చూడండి!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

