చందనపు బొమ్మకు.. కుందన్ సొగసులు
ఆధునిక యువతులు రకరకాల గాజులు ధరిస్తున్నారు. బంగారం, వెండి, ప్లాస్టిక్, ఇతర లోహాలతో తయారైన గాజులూ మగువల అలంకరణలో భాగమయ్యాయి. వీటిని మరింత అందంగా మలిచేందుకు రాళ్లు, రత్నాలు, ముత్యాలు జతచేస్తున్నారు. బంగారపు గాజులతోపాటు మట్టి గాజులకూ కుందన్ సొగసులు జోడిస్తున్నారు.
ఆధునిక యువతులు రకరకాల గాజులు ధరిస్తున్నారు. బంగారం, వెండి, ప్లాస్టిక్, ఇతర లోహాలతో తయారైన గాజులూ మగువల అలంకరణలో భాగమయ్యాయి. వీటిని మరింత అందంగా మలిచేందుకు రాళ్లు, రత్నాలు, ముత్యాలు జతచేస్తున్నారు. బంగారపు గాజులతోపాటు మట్టి గాజులకూ కుందన్ సొగసులు జోడిస్తున్నారు.

పచ్చని పసిమితో మెరిసిపోయే బంగారు గాజులకు సప్తవర్ణాల కళ తోడైతే ఆ వైభోగమే వేరు. కాబట్టే, మగువలు ముచ్చటపడే గులాబి, ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు కుందన్లు జతచేసిన గాజులు ఆన్లైన్లో విరివిగా అమ్ముడు అవుతున్నాయి. ఏ లోహంతో చేసిన గాజులైనా సరే, కుందన్ సొగసుతో నిండుగా కనిపిస్తాయి. ముఖ్యంగా పూజలు, వ్రతాలు, పెండ్లిళ్లు తదితర శుభకార్యాల్లో ధరించే సంప్రదాయ పట్టుచీరలు, పరికిణీలపై కుందన్ గాజులు బావుంటాయి. కుందన్ మెరుపులతో ఇతర లోహాల గాజులు కూడా లభిస్తున్నాయి. ఫ్యాబ్రిక్, త్రెడ్, ప్లాస్టిక్, వన్‌గ్రామ్ నగల్లోనూ ఈ గాజులు భాగం అయ్యాయి. జీన్స్, స్కర్ట్స్ వంటి ఫ్యాషన్ డ్రెస్సులపై ధరించేందుకు వీలుగా సన్నని కుందన్ బ్యాంగిల్స్ వస్తున్నాయి. జతగా అదే రంగు కుందన్లను జోడించిన సన్నని చైన్లు, పెండెంట్లతో ప్రత్యేక కాంబోలూ లభిస్తున్నాయి.
గాజులతో ముస్తాబు చిట్కాలు..
- రాళ్ల గాజుల్లా మరీ తళతళలాడవు. అలా అని సాదా మట్టి గాజుల్లానూ కనిపించవు. హుందాగా కట్టుకునే కాటన్ చీరల మీదికి, ఆఫీసుల్లో చిన్నచిన్న పార్టీలకు వీటిని ధరించవచ్చు.
- కుందన్ గొలుసులను చాలామంది ఇష్టపడతారు. వాటికి మ్యాచింగ్ కావాలనుకున్నప్పుడు.. మనం ధరించే దుస్తుల్ని బట్టి గాజుల్ని కూడా నగలకు సరిపోయేలా ఎంచుకోవచ్చు. మార్కెట్లో ఎన్నో మోడళ్లు దొరుకుతున్నాయి.
- త్రెడ్ బ్యాంగిల్స్ మీద కుందన్లు బాగా ఎలివేట్ అవుతాయి. కాబట్టి ఏదైనా వేడుకకు పట్టుచీర కట్టుకున్నప్పుడు ఆ రంగుకు సరిపోయేలా గులాబి-ఆకుపచ్చ, నీలం-మెరూన్ .. ఇలా భిన్నమైన కాంబినేషన్లను ఎంచుకోవచ్చు. అప్పుడు బంగారు నగలు పెట్టుకున్నా ఇవి సెట్ అవుతాయి.
- ఈ గాజుల్ని మెత్తటి దూది ఉన్న ప్లాస్టిక్ బాక్స్‌లో ఉంచితే కుందన్లు ఎక్కువ కాలం మెరుస్తూ ఉంటాయి. బంగారు నగల్లో పొదిగిన కుందన్లయినా సరే స్ప్రేలూ, ఇతర రసాయనాలకు దూరంగా ఉంచాల్సిందే.
- మీనాకారి నగల్ని ఇష్టపడే వాళ్ల కోసం ఆ వర్క్ చేసిన గాజుల మీద కూడా కుందన్లను పొదుగుతున్నారు. అలాగే పూసల గాజులు, కుందన్లు కలిపి వస్తున్నవి ముత్యాల సెట్ల మీదికి బాగుంటాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

