పెద్ద స్క్రీన్ ఉన్న ఫోన్లను ఒక చేతితో వాడుతున్నప్పుడు జారిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే ఫోన్లో సినిమాలు చూస్తున్నప్పుడు దేనికైనా ఆనించి పెట్టడం కూడా కష్టమే. ఈ సమస్యలను తీరుస్తూ, మీ ఫోన్‌కు అదనపు సౌకర్యాన్ని ఇచ్చేలా Amazon Basics Universal Phone Ring Holder వచ్చేసింది. ఇది 360 డిగ్రీల రొటేషన్, 180 డిగ్రీల ఫ్లిప్పింగ్ సదుపాయంతో వస్తుంది. దీంతో మీరు ఫోన్‌ను ఎలాగైనా సెట్ చేసుకుని వీడియోలు చూసుకోవచ్చు. ఇందులో ఉన్న స్ట్రాంగ్ 3M స్టిక్కర్ మీ ఫోన్, కేస్‌కు చాలా బలంగా అతుక్కుంటుంది. ఈ రింగ్ హోల్డర్ వేలికి మంచి గ్రిప్‌ని ఇస్తుంది. ఇది అన్ని రకాల స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లకు సరిపోతుంది. నలుపు రంగులో ఉండే ఈ రింగ్ హోల్డర్ మీ ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
ధర: 299
దొరుకు చోటు: అమెజాన్

గోడలపై వాలిన దోమలను సాధారణ మస్కిటో బ్యాట్లతో కొట్టడం కొంచెం కష్టం. సరిగ్గా గోడకు ఆనకపోవడం వల్ల దోమలు తప్పించుకుంటూ ఉంటాయి. ఈ సమస్యకు CostarMatter 2025 Foldable Mosquito Racketతో చెక్ పెట్టొచ్చు. ఇది కేవలం దోమలను కొట్టడమే కాదు, ఒకచోట పెడితే అవే వచ్చి పడేలా ట్రాప్ చేస్తుంది కూడా. ఇది 2-ఇన్-1 డ్యూయల్ మోడ్‌తో వస్తుంది. ఇందులో ఉండే యూవీ లైట్ దోమలను ఆకర్షించి ఆటోమేటిక్‌గా ఖతం చేస్తుంది.

ప్రత్యేక డిజైన్ వల్ల గోడకు అంటుకుని ఉన్న దోమలను కూడా అస్సలు వదలకుండా కొట్టవచ్చు. ఈ బ్యాట్ 3000V హై-వోల్టేజ్ పవర్‌తో పనిచేస్తుంది. ఇందులో 1200ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మాన్యువల్ మోడ్‌లో నెల రోజుల వరకు వాడుకోవచ్చు. భద్రత కోసం ఇందులో త్రీ-లేయర్ ఇన్సులేషన్ మెష్,
సేఫ్టీ లాక్ ఉన్నాయి.
ధర: 599 (సుమారుగా)
దొరుకు చోటు: అమెజాన్

డయాబెటిస్ అదుపులో ఉండాలంటే.. ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్‌ను పర్యవేక్షించడం ముఖ్యం. అయితే, ప్రతిసారీ ల్యాబ్‌కు వెళ్లడం ఇబ్బంది. అయితే, ఈ అధునాతన Control D Glucometer Kit.. క్లినికల్ గ్రేడ్ కచ్చితత్వాన్ని అందిస్తుంది. ఇది కేవలం మీటర్ మాత్రమే కాదు.. పూర్తి ప్యాకేజీగా వస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఇది నో-కోడింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అంటే ప్రతిసారీ స్ట్రిప్స్ మార్చినప్పుడు ఎలాంటి కోడింగ్ చేయాల్సిన అవసరం లేదు. తద్వారా తప్పులు జరిగే అవకాశం ఉండదు.
కేవలం 5 సెకన్లలోనే ఫలితాలను చూపిస్తుంది. కేవలం 0.5 మైక్రోలీటర్ల రక్తం ఉంటే చాలు.. చాలా తక్కువ నొప్పితో టెస్ట్ చేసుకోవచ్చు. ఈ కిట్‌లో గ్లూకోమీటర్తోపాటు 50 టెస్ట్ స్ట్రిప్స్, ఒక ల్యాన్సింగ్ డివైస్, 10 సూదులు వస్తాయి. ల్యాన్సింగ్ డివైస్‌లో 5 రకాల సెట్టింగ్స్ ఉంటాయి. దీంతో మీకు సౌకర్యంగా ఉండేలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పెద్ద అక్షరాలతో కూడిన డిస్ప్లే వల్ల వయసు పైబడిన వారు కూడా రీడింగ్స్‌ను సులభంగా చదువుకోవచ్చు.
ధర: 499 (ఆఫర్లను బట్టి మారుతుంది)
దొరుకు చోటు: అమెజాన్

టీ పెట్టాలన్నా, గుడ్లు ఉడకబెట్టాలన్నా, కూరగాయల్ని ఆవిరిపై ఉడికించాలన్నా.. ఒక్కోదానికి ఒక్కో గిన్నె అవసరం. దీనివల్ల గ్యాస్ అయిపోవడంతోపాటు తోమాల్సిన గిన్నెలు కూడా పెరిగిపోతాయి. బ్యాచిలర్స్, ఆఫీసుకి వెళ్లేవారు ఉదయం వేళ తక్కువ సమయంలో హెల్తీగా ఏదైనా చేసుకోవాలనుకుంటే.. ఈ Goodscity Multifunctional 3-in-1 Electric Kettle ఉంటే చాలు. ఇది కేవలం నీటిని మరిగించే కెటిల్ మాత్రమే కాదు.
ఇందులో 1.5 లీటర్ల స్టెయిన్లెస్ స్టీల్ పాట్ ఉంది. దీనిపైనే వచ్చే స్టీమర్ ట్రే సహాయంతో మీరు కూరగాయలను ఆవిరిపై కుక్ చేసుకోవచ్చు. ప్రత్యేకమైన ఎగ్ ట్రే సహాయంతో ఒకేసారి గుడ్లను సులభంగా ఉడకబెట్టవచ్చు. టీ, కాఫీ, నూడుల్స్, బేబీ ఫుడ్, సింపుల్ సూప్స్ లాంటివీ చిటికెలో తయారు చేసుకోవచ్చు. ఇది 600 వాట్ల వేగవంతమైన హీటింగ్ ఎలిమెంట్‌తో వస్తుంది. భద్రత కోసం ఇందులో ‘ఆటోమేటిక్ ఓవర్ హీట్ ప్రొటెక్షన్’ ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ బాడీ వల్ల దీన్ని శుభ్రం చేయడం కూడా చాలా సులభం.
ధర: 1,199
దొరుకు చోటు: అమెజాన్