కౌమారం ఓ సవాలు. హార్మోన్ల ప్రభావంతో వచ్చే మానసిక, శారీరక మార్పులను తట్టుకోవడం బాలికలకు పెద్ద ఇబ్బంది. అందులోనూ రుతుస్రావంతో నీరసించిపోతుంటారు. ఇలాంటి సమయంలో కొన్ని పోషకాలు తప్పనిసరి. అవి…
ఐరన్: బహిష్టు సమయంలో కోల్పోయే రక్తాన్ని భర్తీ చేసుకోడానికి, ఒంట్లో తగినంత ఐరన్ ఉండాలి. రక్తహీనతను పాలకూర, మాంసం అడ్డుకుంటాయి.
క్యాల్షియం: ఎదిగే వయసులో క్యాల్షియం అవసరాలకు పాలు, పాలపదార్థాలు తీసుకోవాలి.
జింక్: రెడ్ మీట్, సిరిధాన్యాల ద్వారా లభించే జింక్ వల్ల శరీరం ప్రొటీన్లను సమర్థంగా ఉపయోగించుకోగలుగుతుంది. జన్యు
నిర్మాణానికీ జింక్ అవసరం.
ప్రొటీన్స్: కండరాలు దృఢంగా ఉండేందుకు తగినంత ప్రొటీన్ తప్పనిసరి. కోడిగుడ్లు లాంటి ఆహారం ద్వారా ఈ ప్రొటీన్ అందుతుంది.
పీచు పదార్థాలు: పీచు ఎక్కువగా లభించే ఆహారం వల్ల జీర్ణశక్తి మెరుగుపడటమే కాకుండా, కౌమారంలో అధిక బరువు సమస్యను కూడా ఎదుర్కోగలం.
..వీటితోపాటు కార్బొహైడ్రేట్స్, విటమిన్-ఎ, సి, ఫోలేట్ ఎక్కువగా ఉండే పదార్థాలను కూడా పళ్లెంలో చేర్చు కోవాల్సిందే.