Vishnu Tenkayala | కియారా పెళ్లి వేడుక షూట్ చేసింది మన ఫొటోగ్రాఫరే.. ఎవరతను?
Vishnu Tenkayala | స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా పెండ్లి వీడియో షూటింగ్‌కు కూడా ఆలస్యంగా వెళ్లాడు. ఇంత గొప్ప అవకాశం వచ్చినా, అంత ఆలస్యం చేసిన ఆ కుర్రాడు ఎవరా అని ఆలోచిస్తున్నారా? పేరు విష్ణు టెంకాయల.
Vishnu Tenkayala | షార్ట్‌ఫిల్మ్‌లు, ఫిక్షన్ ఫీచర్ సినిమాలు చేసే ఓ వీడియోగ్రాఫర్‌కు ఒక పెద్ద సెలెబ్రిటీ పెండ్లిసందడిని కెమెరాలో బంధించే ఆఫర్ వస్తే ఎలా ఫీలవుతాడు? ఏముంది.. ఉక్కిరిబిక్కిరవుతాడు. ఉబ్బితబ్బిబ్బవుతాడు. చెప్పిన రోజుకు ఒక పూట ముందే లొకేషన్లో సకల అస్త్రాలతో సిద్ధమవుతాడు. ఆ కుర్రాడు మాత్రం అలాకాదు. స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా పెండ్లి వీడియో షూటింగ్‌కు కూడా ఆలస్యంగా వెళ్లాడు. ఇంత గొప్ప అవకాశం వచ్చినా, అంత ఆలస్యం చేసిన ఆ కుర్రాడు ఎవరా అని ఆలోచిస్తున్నారా? పేరు విష్ణు టెంకాయల. మనోడే!

బెంగళూరులో స్థిరపడిన విష్ణుకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. షార్ట్‌ఫిల్మ్స్ తీసేవాడు. ఏడేండ్ల కిందట ఫేస్బుక్లో ఓ పెండ్లి వీడియో చూశాడు. అది చూడగానే విష్ణు ఆశ్చర్యపోయాడు. అప్పటి వరకు ఆయన ఎన్నో పెండ్లి వీడియోలు చూశాడు. ఇది మాత్రం వాటికి భిన్నంగా కనిపించింది. కొత్తగా అనిపించింది. ఏదో సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది. ఆ వీడియో కింద ఉన్న అడ్రస్‌కు భారీ లేఖ రాసి మెయిల్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత విష్ణుకు ఒక ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తన పేరు విశాల్ అని పరిచయం చేసుకున్నాడు. ‘నువ్వు చూసిన పెండ్లి వీడియో నేను షూట్ చేసిందే. దవెడ్డింగ్ ఫిల్మర్ పేరుతో కంపెనీ నడిపిస్తున్నా. మీరు పంపిన మెయిల్ నచ్చింది..’ అని చెబుతూనే ‘ఓ ఇంటర్వ్యూ ఉంది ముంబైకి వెళ్తావా?’ అని అడిగాడు. తన మెయిల్‌కు విశాల్ స్పందించడాన్ని గొప్పగా భావించాడు విష్ణు. ముంబై ఇంటర్వ్యూకు నో చెప్పడానికి కారణాలు కనిపించలేదు. ‘అప్పటివరకు నేను చేసిన పని వేరు. ముంబైలో నేర్చుకున్నది వేరు. షూటింగ్లో మెలకువలన్నీ నేర్చుకున్నా’ అంటాడు విష్ణు.

ఈ ప్రయాణంలో విష్ణు తన పనితనాన్ని రుజువు చేసుకున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్ తీస్తూనే వెడ్డింగ్ వీడియోగ్రాఫర్‌గా తన పనితనంతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇటీవల కియారా, సిద్ధార్థ్ పెండ్లి వేడుకను షూట్ చేసే వీడియోగ్రాఫర్లలో ఒకడిగా అవకాశం దక్కించుకున్నాడు. ‘సెలెబ్రిటీల పెండ్లి షూట్ చేయడం మాటలు కాదు. ఇది సినిమా కాదు కదా! రీ టేక్‌లు ఉండవు. లైవ్‌లోనే అదిరిపోయే దృశ్యాన్ని క్యాప్చర్ చేయాలి. అది ఆ దంపతులకు కలకాలం గుర్తుండిపోయేలా ఉండాలి’ అంటాడు విష్ణు. కియారా, సిద్ధార్థ్ జోడీని అదిరిపోయేలా చిత్రీకరించానని చెబుతున్నాడు. ‘ఇప్పటివరకు నా జర్నీ హ్యాపీగా సాగింది. ఓ సినిమా తీయడమే నా జీవిత లక్ష్యం’ అంటున్న విష్ణుకు మనమూ ఆల్ ద బెస్ట్ చెబుదాం.

Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

