లాలనతో మేలైన తెలివి
తల్లి ప్రేమకి హద్దులు ఉండవు. మరి ఆ ప్రభావం ఊరకనే పోతుందా! తల్లి ప్రేమతో మెదడే మారిపోతుందని కొన్ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. తల్లి ప్రేమని పొందే విద్యార్థులు మిగతావారితో పోలిస్తే చదువులో చురుగ్గా ఉంటారనీ, పరిపక్వతతో వ్యవహరిస్తారనీ తెలుస్తున్నది.
తల్లి ప్రేమకి హద్దులు ఉండవు. మరి ఆ ప్రభావం ఊరకనే పోతుందా! తల్లి ప్రేమతో మెదడే మారిపోతుందని కొన్ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. తల్లి ప్రేమని పొందే విద్యార్థులు మిగతావారితో పోలిస్తే చదువులో చురుగ్గా ఉంటారనీ, పరిపక్వతతో వ్యవహరిస్తారనీ తెలుస్తున్నది. పిల్లల మెదడు మీద తల్లి ప్రభావాన్ని తేల్చేందుకు పరిశోధకులు 3 నుంచి 6 ఏళ్ల లోపున్న 92 మంది పిల్లలను ఎన్నుకొన్నారు. ప్రయోగంలో భాగంగా చిన్నారిని తల్లితో పాటు ఐదు నిమిషాల పాటు ఒక గదిలో ఉంచారు.
ఆ సమయంలో ఏదో ఫారం పూర్తిచేయమని తల్లికి చెప్పారు. పిల్లవాడి కళ్ల ముందు ఓ ఆకర్షణీయమైన కాగితంలో చుట్టిన బహుమతిని ఉంచారు. తల్లి ఫారంని పూర్తిచేసేవరకూ పిల్లవాడు ఆ కాగితంలో తన కోసం ఏ బహుమతి ఉందో చూడ్డానికి లేదంటూ షరతు విధించారు. సహజంగానే పిల్లవాడు తన ముందున్న ప్యాకెట్లో ఉన్న బహుమతిని తీసి చూడాలన్న తపనతో ఉంటాడు.
ఆ సమయంలో తల్లి ఒక పక్క ఫారంని పూర్తిచేస్తూనే తన కొడుకుని సముదాయించక తప్పదు. ఈ సమయంలో వారిని కొందరు సైకాలజిస్టులు గమనించారు. పిల్లవాడితో తల్లి ఎంత ప్రేమగా వ్యవహరిస్తున్నదో చూసి, దాన్ని బట్టి వారిరువురి మధ్య బంధాన్ని అంచనా వేశారు. ఓ నాలుగేళ్లు గడచిన తర్వాత ఆనాటి పిల్లలను మళ్లీ ల్యాబ్‌కు తీసుకువచ్చారు పరిశోధకులు. అక్కడ MRI స్కానింగ్ ద్వారా వారి మెదడులో వచ్చిన మార్పుని అంచనా వేశారు.
ప్రేమగా చేసుకునే తల్లులు ఉన్న పిల్లల్లోని హిప్పోక్యాంపస్ అనే భాగంలో అనూహ్యమైన ఎదుగుదల వచ్చినట్లు గమనించారు. తల్లి అంత ప్రేమగా వ్యవహరించని పిల్లలకంటే వీరి హిప్పోక్యాంపస్ ఏకంగా పదిశాతం ఎక్కువగా ఎదిగింది. తల్లిప్రేమ పొందిన పిల్లలలో డిప్రెషన్ వంటి లక్షణాలు కూడా తక్కువగా ఉన్నట్లు ఈ ప్రయోగంలో తేలింది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

