కోట మైసమ్మ ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన విశ్వామిత్ర చౌహాన్
ప్రసిద్ధ ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
కారేపల్లి, అక్టోబర్ 25: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని ప్రసిద్ధ ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణవేత్త విశ్వామిత్ర చౌహాన్, ఆలయ ధర్మకర్త పట్టాభిరామారావు, వేద పండితులతో కలిసి అరుదైన పెద్ద నేరేడు మొక్కను నాటారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, ఆశీర్వచనాల మధ్య మొక్కను నాటి నీరు పోశారు.
వాక్ ఫర్ ట్రీస్ యజ్ఞంలో భాగంగా విశ్వామిత్ర చౌహాన్ నాటిన మొక్కల్లో ఇది 1606వది కావడం విశేషం. గత కొన్ని నెలలుగా ఆయన నిరంతరం మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. కోట మైసమ్మ జాతర సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు ఆయన పర్యావరణ సేవలను అభినందించారు. ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటడం వల్ల పచ్చదనం పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని ఆనందం వ్యక్తం చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
Road accident | కొల్లూర్ ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Kerala woman | తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు.. 13 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీ, పిల్లలు
DDLJ Movie | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. థియేటర్లలోకి ‘డిడిఎల్జె’ రీ-రిలీజ్!
AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీలేదు.. ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

