‘సీతారామ’ పనుల్లో వేగం పెంచాలి
సీతారామ ప్రాజెక్టు స్టేజ్-2 పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు, ఎన్నెస్పీ లింక్ కెనాల్‌కు ఎంజాయ్మెంట్ సర్వే పూర్తయి.. ఎగ్జిక్యూటివ్ పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు.
- కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
మామిళ్లగూడెం, జూలై 9 : సీతారామ ప్రాజెక్టు స్టేజ్-2 పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు, ఎన్నెస్పీ లింక్ కెనాల్‌కు ఎంజాయ్మెంట్ సర్వే పూర్తయి.. ఎగ్జిక్యూటివ్ పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. ప్రాజెక్టు పూర్తికి సంబంధించి మిగిలిన భూ సేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. కాల్వ ఏర్పాటుతో రైతుల భూముల విలువ పెరుగుతుందని, దీనిపై వారికి అవగాహన కల్పించాలన్నారు. 75 శాతం కంటే ఎకువ భూమిని కోల్పోతున్న రైతులు, సాగుకు మిగులు భూమి అకరకు రాకపోతే అలాంటి భూమిని సేకరించాలన్నారు. భూములు ఇచ్చిన రైతులకు గిరి వికాసం తదితర ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యతనివ్వనున్నట్లు పేర్కొన్నారు. పనుల్లో వేగం పెంచి నిర్ణీత సమయంలోగా ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. సమీక్షలో ఎస్డీసీ ఎం.రాజేశ్వరి, ఇరిగేషన్ ఈఈ అర్జున్, జిల్లా ఉద్యానవన అధికారి వెంకటరమణ, కలెక్టరేట్ భూసేకరణ సూపరింటెండెంట్ మీనన్, ఏనూరు తహసీల్దార్ శేషగిరిరావు, ఉద్యానవన అధికారి వేణు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

