ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. సుజాతనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు.
- భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల
భద్రాద్రి కొత్తగూడెం, మే 23 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. సుజాతనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. ధాన్యాన్ని పరిశీలించి తేమ శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కొనుగోలు కేంద్రానికి తరలించిన ధాన్యాన్ని నిర్ణీత తేమ శాతం(17) వచ్చేంత వరకు ఆరబెట్టుకోవాలని అన్నారు. రానున్న రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ట్యాగింగ్ చేసి రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్డీవో విద్యాచందన, పౌర సరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ త్రినాథ్బాబు, జిల్లా పౌరసరఫరాల అధికారి రుక్మిణి, జిల్లా వ్యవసాయాధికారి బాబురావు, జిల్లా సహకార అధికారి సయ్యద్ ఖుర్షీద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

