జల తరంగ్ నవాజ్‌జంగ్
అలనాటి అపర భగీరథుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్.. తెలంగాణ గర్వించ దగిన విలక్షణమైన ఇంజినీర్. నదులను ఒడిసి పట్టి సాగు, తాగునీటి వనరులను భవిష్యత్ తరాలకు అందించిన గొప్ప దార్శనికుడు.
- అపర భగీరథుడు బహదూర్ సాబ్
- పాలేరు, వైరా జలాశయాల రూపశిల్పి ఆయనే..
- వందేళ్లు దాటినా చెక్కు చెదరని ఖమ్మం మున్నేరు బ్రిడ్జి
- నేడు రాష్ట్ర ఇంజినీర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం..
ఖమ్మం, జూలై 10: అలనాటి అపర భగీరథుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్.. తెలంగాణ గర్వించ దగిన విలక్షణమైన ఇంజినీర్. నదులను ఒడిసి పట్టి సాగు, తాగునీటి వనరులను భవిష్యత్ తరాలకు అందించిన గొప్ప దార్శనికుడు. నైజాం కాలంలో ఆయన నీటి వనరుల నిపుణుడిగా ప్రఖ్యాతిగాంచాడు. వలస పాలనలో ఆయన చరిత మరుగున పడిపోయినప్పటికీ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సర్కార్ ఆయన సేవలను వెలుగులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆయన చేసిన కృషికి గాను ఏటా జూలై 11న నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ జయంతి సందర్భంగా ‘రాష్ట్ర ఇంజినీర్స్ డే’ నిర్వహించాలని నిర్ణయించారు. 2014 నుంచి ఏటా ఇదే తేదీన వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇంజినీర్స్, సాంకేతిక నిపుణులు ఆయన సేవలను ప్రజలకు చాటి చెప్తున్నారు. నవాబ్ జంగ్ ఆయన దార్శనికతతో మన జిల్లాకు ‘జల వరాలు’ అందించారు. ఆ ప్రాజెక్టులపై నేడు ఇంజినీర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.
వరదాయిని పాలేరు జలాశయం
మనం నేడు గొప్పగా చెప్పుకునే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నిజాం సాగర్, దిండి, కోయల్‌సాగర్, కడెం , పోచంపాడు, లోయర్ మానేరు ప్రాజెక్టులన్నీ నవాజ్ జంగ్ నిర్మించినవే. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ, అఫ్జల్‌గంజ్‌లోని స్టేట్ సెంట్రల్ లైబ్రెరీ, ఉస్మానియా ఆస్పత్రి అన్నీ ఆయన కాలంలో రూపుదిద్దుకున్నవే. ఇదే ఒరవడిలో 1920లో గుర్రాలపై ఖమ్మం ప్రాంతానికి వచ్చారు నవాజ్ జంగ్. పాలేరు చెరువును చూసిన ఆయన అక్కడ అనకట్ట నిర్మించాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని నైజాం నవాబుకు తెలపడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1922లో పనులు ప్రారంభిస్తే 1928 నాటికి పూర్తయ్యాయి. 1929లో ప్రాజెక్టును ప్రారంభమైంది. ఏటా కుడి, ఎడమ కాలువల ద్వారా 2.5 టీఎంసీల నీరు 19,500 ఎకరాల ఆయకట్టుకు అందేలా ఆనకట్ట నిర్మించారు.
వైరా ప్రాజెక్టు నిర్మాణ శిల్పి..
వైరాకు సమీపంలో వైరా నదిపై 1923లో ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. 1930లో పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు కింద 17,390 ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలమైంది. వైరా, తల్లాడ, బోనకల్లు మండలాల్లోని సాగుభూములకు దీని ద్వారా సాగునీరు అందుతుంది. ఏన్కూరు, కామేపల్లి, కారేపల్లి మండలాలకు ఇక్కడి నుంచి వచ్చే వరద నీరే ప్రధాన అదరువు. ఈ ప్రాజెక్టు పరిధిలో కుడి, ఎడమ కాల్వలు ఉన్నాయి.
మున్నేరు బ్రిడ్జి నిర్మించిందీ ఆయనే..
ఖమ్మం నగరంలోని కాల్వ ఒడ్డు సమీపంలో మున్నేరుపై ఉన్న వంతెనకు 1917లో నవాజ్ జంగ్ పనులు ప్రారంభించారు. నాలుగేళ్లలో వంతెన పూర్తి చేశారు. పూర్తిగా రాయి కట్టుబడితో నిర్మించిన ఈ వంతెన వందేళ్లు పూర్తయినా చెక్కు చెదరక పోవడం ఆయన మేధస్సుకు తార్కాణం.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

