కేసీఆర్ స్వప్నం.. సాకారం
స్వరాష్ట్ర ఉద్యమసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రసుత్త మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నం సాకారమైంది. అపర భగీరథుడిగా ఆయన అంకురార్పణ చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సాగునీటి ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైంది.
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి పరవళ్లు.. రైతన్నకు సాగునీళ్లు..
- లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ‘సీతారామ’ ట్రయల్ రన్ సక్సెస్
- కరువును పారదోలే కల్పతరువైన ‘సీతారామ’ది బీఆర్ఎస్ సర్కారు ఫలితమే..
ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, జూన్ 27 : స్వరాష్ట్ర ఉద్యమసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రసుత్త మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నం సాకారమైంది. అపర భగీరథుడిగా ఆయన అంకురార్పణ చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సాగునీటి ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమైంది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రైతుబాంధవుడైన కేసీఆర్.. అన్నదాతల కోసం అపర భగీరథుడయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ‘సీతారామ’ పేరిట గోదావరిపై ఎత్తిపోతల పథకానికి 2016 ఫిబ్రవరి 16న శ్రీకారం చుట్టారు. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో రూ.17 వేల కోట్ల అంచనాలతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర సాగునీటి పథకాన్ని చేపట్టారు. అప్పటి నుంచి దాని పనులు వివిధ దశల్లో కొనసాగుతూ ఇటీవలే ముగింపు దశకు వచ్చాయి. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తన గొప్పగా చెప్పుకుంటోంది. ఈ క్రమంలో గురువారం జిల్లాకు వచ్చిన నలుగురు మంత్రులు.. కనీసం వ్యూ పాయింట్ నుంచి కూడా ప్రాజెక్టును పరిశీలించలేదు. అది ఎక్కడ ఉందో, ఎలా పనిచేస్తుందో గమనించలేదు. కేవలం సీతమ్మబరాజ్ను, కాలువను పరిశీలించి వెళ్లారు. ఈ ప్రాజెక్టు పనుల్లో తట్టెడు మట్టి కూడా పోయని నేటి కాంగ్రెస్ పాలకులు.. ఈ ప్రాజెక్టు ఘనత అంతా తమదేనని చెప్పుకుంటుండడంతో జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. కరువును పారదోలే కల్పతరువైన ఈ సీతారామ ప్రాజెక్టు ఫలితమంతా గత కేసీఆర్ ప్రభుత్వానిదేనంటూ చర్చించుకున్నారు.
లక్షల ఎకరాలకు సాగునీరందించేలా..
భవిష్యత్ తరాలకు సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యేందుకు గత కేసీఆర్ సర్కారు ముందుచూపుతో ఈ ప్రాజెక్టుకు పునాది వేసింది. 2016 ఫిబ్రవరి 18న జీవో నెం 72 ద్వారా రూ.7,926 కోట్ల నిధులను మంజూరు చేసింది. తర్వాత దశల వారీగా నిధులు మంజూరు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు మహబూబాబాద్ జిల్లాకు కూడా నీరందించేందుకు పనులు చేపట్టింది. మూడు జిల్లాల్లో కలిపి మొత్తంగా 6,74,387 ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు శ్రమించింది. దశల వారీగా పనులన్నీ పూర్తి చేసింది. ట్రయల్ రన్ వేయడమే తరువాయి అనుకున్న సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కారు మాత్రం తమ పాలనలోనే సీతారామ పూర్తయిందంటూ గప్పాలు చెప్పుకొని ట్రయల్ రన్ పూర్తి చేసింది.
గోదావరి పరవళ్లు.. రైతన్నకు సాగునీళ్లు..
గోదావరిపై ప్రాజెక్టు నిర్మించి ఇక్కడి బీడు భూములను సాగులోకి తేవాలన్న ఉద్యమసారథి సంకల్పం నెరవేరబోతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల పాలిట కల్పతరువు కాబోతోంది. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద ఉన్న బీజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతోంది. గోదావరి పరవళ్లతో రైతున్నకు సాగునీళ్లు అందబోతున్నాయి.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

