‘సేవాలాల్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి’
సంత్ సేవాలాల్ మహరాజ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని వక్తలు అభిప్రాయపడ్డారు. సేవాలాల్ జయంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాలలో గురువారం నిర్వహించిన వేడుకల్లో వారు మాట్లాడారు.
ఖమ్మం, ఫిబ్రవరి 15: సంత్ సేవాలాల్ మహరాజ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని వక్తలు అభిప్రాయపడ్డారు. సేవాలాల్ జయంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాలలో గురువారం నిర్వహించిన వేడుకల్లో వారు మాట్లాడారు. గిరిజన సమాజానికి సంత్ సేవాలాల్ అమూల్యమైన సేవలందించారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా సంత్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాశాల హెచ్‌వోడీ జే.రమేశ్, ప్రొఫెసర్ సాంబశివరావు, నాయకులు, ఇతర ప్రముఖులు బానోత్ భద్రూనాయక్, పీఆర్ దేవి, నరేంద్ర, బట్టు రాజేంద్ర, ఉపేంద్రబాయి, పుల్లూరి నాగయ్య, జంగిపల్లి రవి, రవీంద్రనాయక్, మహేంద్రనాయక్, సురభి నాయక్, రమేశ్‌నాయక్, వీరన్ననాయక్, శ్రీనివాస్‌నాయక్, మణి, నాగలక్ష్మి, రమ్య తదితరులు పాల్గొన్నారు.
కారేపల్లిలో..
కారేపల్లి, ఫిబ్రవరి 15: సంచార బంజారాలను ఏక తాటిపైకి తీసుకొచ్చి, వారికి ఆరాధ్యుడిగా మారిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను కారేపల్లిలో గిరిజనులు నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో ఎస్ఐ పుష్పాల రామారావు తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లిలో..
పెనుబల్లి, ఫిబ్రవరి 15: మండలంలోని వీ.ఎం.బంజర సోమ్లానాయక్ తండాలో గ్రామ పెద్ద బర్మావత్ మంగూనాయక్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. నాయకులు ధర్మసోత్ దశరథ్ నాయక్, కృష్ణానాయక్, చిత్రయనాయక్, రాములునాయక్, రామ్‌సింగ్‌నాయక్, భాషానాయక్ తదితరులు పాల్గొన్నారు.
వేంసూరులో..
వేంసూరు, ఫిబ్రవరి 15: మండలంలోని చోడవరం తండాలో జరిగిన వేడుకల్లో తహసీల్దార్ ఎంఎ.రాజు, ఎంపీవో రంజిత్‌కుమార్, ఎంఈవో చలంచర్ల వెంకటేశ్వరరావు, నాయకులు భూక్యా నాగులు, బాషా, నాను తదితరులు పాల్గొన్నారు.
కూసుమంచిలో..
కూసుమంచి, ఫిబ్రవరి 15: నేలకొండపల్లి మండల కేంద్రంలోని ఎంఆర్సీ భవనంలో సంతు సేవాలాల్ జయంతిని జరుపుకున్నారు. ఉద్యోగులు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
తిరుమలాయపాలెంలో..
తిరుమలాయపాలెం, ఫిబ్రవరి 15: మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో సంత్ సేవాలాల్ జయంతిని జరిపారు. ఎంపీపీ బోడ మంగీలాల్, బీరోలు సొసైటీ చై ర్మన్ రామసహాయం నరేశ్‌రెడ్డి, తహసీల్దార్ రాంప్రసాద్ తదితరులు సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

