వెళ్లిరా బతుకమ్మ..
ఆడబిడ్డలకు ప్రీతిపాత్రమైన పండుగ. తొమ్మిది రోజులపాటు ఊరువాడను ఒక్కటి చేసే వేడుక. ఎనిమిది రోజులపాటు బతుకమ్మ ఆడిన మహిళలు తొమ్మిదో రోజు సంబురంగా సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకున్నారు.
- సంస్కృతిని ప్రతిబింబించేలా పూల పండుగ
- తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు
- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘సద్దుల’ సంబురాలు
- ఆటపాటలతో మహిళలు, యువతుల సందడే సందడి
నమస్తే నెట్వర్క్ ; ఆడబిడ్డలకు ప్రీతిపాత్రమైన పండుగ. తొమ్మిది రోజులపాటు ఊరువాడను ఒక్కటి చేసే వేడుక. ఎనిమిది రోజులపాటు బతుకమ్మ ఆడిన మహిళలు తొమ్మిదో రోజు సంబురంగా సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చిన మహిళలు గౌరమ్మను ప్రతిష్ఠించి నియమ నిష్టలతో పూజలు చేశారు. సాయంత్రం వేళ వాగులు, చెరువుల వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేసి వీడ్కోలు పలికారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ ఊరూరా సందడి తెచ్చింది. పండుగ సంబురాన్ని అంబరాన్నంటేలా చేసింది. సప్తవర్ణాలు పులుముకున్న తీరొక్క పూలను సేకరించిన మహిళలు.. ఆకర్షణీయంగా రంగులద్దడంతో మరింత శోభను సంతరించుకున్నది. సద్దుల బతుకమ్మ పండుగకు పుట్టింటికి చేరిన ఆడబిడ్డలు రంగుల పూలను వరుసగా పేర్చి శిఖరంలా అందంగా ముస్తాబు చేశారు. పైన గౌరమ్మను ప్రతిష్ఠించి మదినిండా తలుస్తూ భక్తిశ్రద్ధలతో బతుకమ్మకు పూజలు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం సాయంత్రం మేళతాళాల నడుమ బతుకమ్మలను తలపై పెట్టుకొని నదీ తీరాలు, చెరువులు, కాల్వలు, కుంటల వద్దకు పయనమయ్యారు. గట్టున చుట్టూ బతుకమ్మలను పెట్టి ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.., చిత్తూ చిత్తూల బొమ్మ.. అంటూ మహిళలు, యువతులు పాటలు పాడుతూ సందడి చేశారు. బతుమ్మలను గంగమ్మ ఒడికి చేర్చి వెళ్లి రావమ్మా అంటూ వీడ్కోలు పలికారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకొని వెంట తెచ్చిన పిండి పదార్థాలను పంచుకొని ఇంటిదారి పట్టారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
Jeevan Reddy | రేవంత్ మూడేళ్లలో రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ములకలపల్లి మండలంలో అతి భారీ వర్షం
Munnuru Kapu | మున్నూరు కాపులకు అన్యాయం చేస్తే సహించేది లేదు : రాష్ట్ర కార్యదర్శి హెచ్చరిక
Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 3వ పొజిషన్లో 13 వేల రన్స్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

