R.narayanamurthy | రైతుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం: సినీనటుడు ఆర్.నారాయణమూర్తి..

సత్తుపల్లి: నూతన వ్యవసాయ చట్టాల పేరుతో కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆదుకుంటుంటే, మరో పక్క మోడీ ప్రభుత్వం రైతులను కుంగదీస్తుందని ఆయన విమర్శించారు. గురువారం స్థానిక న్యూడెమోక్రసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం నల్లచట్టాలను తీసుకొచ్చి, రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేకుండా కార్పొరేట్ సంస్థలకు రైతులను తాకట్టు పెట్టే విధంగా పనిచేస్తుందని విమర్శించారు.
రైతులు ఏ పంట వేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రైతులు పంటలు పండక, విద్యుత్ లేక ఆర్ధికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునేవారని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత విద్యుత్ 24 గంటల పాటు కల్పించి రైతులకు పంట పెట్టుబడిగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు. రైతుల జీవితాలను కళ్ళకు కట్టినట్లు రైతన్న సినిమాను తెరకెక్కించానని, రైతులు ఈ సినిమా చూసి తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో న్యూడెమోక్రసీ, సీపీఎం, సీపీఐ నాయకులు కూకలకుంట రవి, మోరంపూడి పాండు, తడికమళ్ళ యోబు, అమర్లపూడి రాము, శరత్, రామకృష్ణ, రాజబాబు తదితరులున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

