జిల్లాలో 144 సెక్షన్ అమలు
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఈ నిబంధనలు తప్పక వర్తిస్తాయని పేర్కొన్నారు.
- పోలీస్ కమిషనర్ సునీల్ దత్
మామిళ్లగూడెం, జూన్ 3 : పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఈ నిబంధనలు తప్పక వర్తిస్తాయని పేర్కొన్నారు. సెక్షన్ అమలులో భాగంగా ప్రజలు రహదారులపై గుమిగూడి ఉండడం, సభలు, సమావేశాలు, ర్యాలీలు, డీజేలు, మైకులతో ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించడం వంటివి చేయకూడదని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి 200 మీటర్లలోపు ఐదుగురికంటే ఎక్కువ వ్యక్తులు ఉండేందకు అనుమతి లేదని, పోలీసు నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈవ్ టీజింగ్‌కు గురైతే సమాచారం అందించాలి
మహిళలు, విద్యార్థినులు, యువతులు ఈవ్ టీజింగ్ బారిన పడితే వెంటనే షీ టీం సెల్ నెంబర్ 8712659222కు సమాచారం అందించాలని సీపీ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీటీమ్ బృందంతో నిఘా ఉంచామని పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల జిల్లాలో జరిగిన ఓ ఘటనలో బాధితుల ఫిర్యాదుకు వెంటనే స్పందించి నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్, విద్యాసంస్థలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో షీ టీమ్స్ మఫ్టీలో తిరుగుతూ నిరంతర నిఘా పెట్టినట్లు తెలిపారు. మే నెలలో 13 ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో 3 ఎఫ్ఐఆర్ చేయగా.. మరో 3 పెట్టి కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. మరో ఐదుగురికి కౌన్సిలింగ్ చేశామని తెలిపారు. 48 అవగాహన సదస్సులు నిర్వహించి మహిళలు, విద్యార్థులను చైతన్యం చేశామని పేర్కొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

