‘నామా’కు భారీ మెజార్టీ ఇవ్వండి
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు భారీ మెజార్టీ అందించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కోరారు. అలాగే, ఐదు నెలల్లోనే అరిగోస పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
- ఐదు నెలల్లోనే అరిగోస పెడుతున్న కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పండి
- కాలయాపనే తప్ప పథకాలిచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు
- ఖమ్మం నగరంలోని డివిజన్ల రోడ్‌షోలో మాజీ మంత్రి అజయ్
ఖమ్మం, మే 10: ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు భారీ మెజార్టీ అందించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కోరారు. అలాగే, ఐదు నెలల్లోనే అరిగోస పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కారణా లు చెబుతూ కాలయాపన చేయడమే తప్ప ఇచ్చిన మాట ప్రకారం పథకాలు ఇచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం కోసం ఖమ్మం వన్‌టౌన్, త్రీటౌన్ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలలో ఆయన మాట్లాడారు. 14 ఏళ్ల అలుపెరగని పోరాటంతో ఉద్యమసారథి తెలంగాణను సాధించారని, ముఖ్యమంత్రిగా పదేళ్లలో స్వరాష్ర్టాన్ని తీర్చిదిద్దారని గుర్తుచేశారు. కానీ తప్పుడు హామీలతో ఇటీవల అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటిని అటకెక్కించిందని విమర్శించారు. ఇన్ని రోజులైనా పింఛన్లు పెంచలేదని, రూ.500కే గ్యాస్ ఇవ్వలేదని దుయ్యబట్టారు. అన్ని హామీలనూ అలాగే వదిలేశారని విమర్శించారు. ‘నిత్యం కరెంటు పోవడం, తాగునీరు రాకపోవడం వాస్తవం కాదా?’ అంటూ సభికులను ప్రశ్నించారు. దీంతో వారంతా ‘అవును.. కరెంటో పోతోంది. నీళ్లు సరిగా రావట్లేదు..’ అం టూ సమాధానమిచ్చారు. అలాగే, గోళ్లపాడు కాలువను రూ.70 కోట్లతో అభివృద్ధి చేస్తే రూ.170 కోట్లంటూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేశారని అన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆర్జేసీ కృష్ణ, లక్ష్మీప్రసన్న, కూరాకుల నాగభూషణం, పగడాల నాగరాజు, కొత్తా వెంకటేశ్వర్లు, కర్నాటి కృష్ణ, పసుమర్తి రామ్మోహన్, మక్బూల్, దాదే అమృతమ్మ, తోట ఉమారాణి, కన్నం వైష్ణవి, మక్బూల్, పల్లా రోజ్ లీనా, మాటేటి నాగేశ్వరరావు, తోట రామారావు, గడ్డం త్రిలోక్, సాయికిరణ్, రుద్రగాని ఉపేందర్, తోట వీరభద్రం, రవినాయక్, బండారు శ్రీనివాస్, తోగారు భాసర్, పారా ఉదయ్, షకీనా, గౌతమ్ బాబా, గార్లపాటి సంతోశ్, గోళ్ల వెంకట్, తౌసిఫ్ (బాబా) తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

