బంగారు బతుకమ్మ అందంగా మురిసె
ఆడబిడ్డలకు ప్రీతిపాత్రమైన పండుగైన బతుకమ్మ శనివారం ‘ఎంగిలి పూల బతుకమ్మ’తో షురూ అయింది.. గ్రామగ్రామాన మహిళలు రంగు రంగుల పూలతో బతుకమ్మలను అలంకరించారు.
- ఎనిమిది రోజుల ‘పూల పండుగ’ షురూ..
- తొలిరోజు ఎంగిలి ‘పూల బతుకమ్మ’ సందడి
- ఊరూరా బతుకమ్మను ఎత్తుకున్న ఆడబిడ్డలు
- నదులు, చెరువులు, వాగుల వద్ద గౌరమ్మకు పూజలు
ఖమ్మం, అక్టోబర్ 14 : ఆడబిడ్డలకు ప్రీతిపాత్రమైన పండుగైన బతుకమ్మ శనివారం ‘ఎంగిలి పూల బతుకమ్మ’తో షురూ అయింది.. గ్రామగ్రామాన మహిళలు రంగు రంగుల పూలతో బతుకమ్మలను అలంకరించారు.. ప్రధాన కూడళ్లలో బతుకమ్మలు ఉంచి ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’, ‘శ్రీలక్ష్మి నీ మహిమలు..’, ‘సిత్తూ సిత్తుల బొమ్మ.. శివునీ ముద్దుల గుమ్మ..’ అని పాటలు పాడారు.. లయబద్ధంగా నృత్యం చేస్తూ సందడి చేశారు..
పూల జాతర ప్రారంభమైంది.. తెలంగాణ ఆడబిడ్డల ఆరాధ్య పండుగ బతుకమ్మ మహాలయ అమావాస్య శనివారం ఎంగిలి పూలతో సంబురాలు జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆడబిడ్డలు రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను ఎత్తుకొని ఉత్సాహంగా పలు ఆలయాల ప్రాంగణాలు, కూడళ్ల వద్దకు తరలివచ్చి బతుకమ్మ ఆటపాటలాడి సందడి చేశారు. వీధుల్లో వరుస కట్టిన బతుకమ్మలు జిల్లాను వేనవేల హరివిల్లులను చేశాయి.. రంగు రంగుల పూల గుచ్ఛాలు ఒక్కటై పూలశిఖరాలయ్యాయి… జిల్లా పూదోటగా మారి బతుకమ్మలతో సింగారించుకుంది.. జిల్లా వ్యాప్తంగా వాడవాడలా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఖమ్మం నగరంలోని 51 వ డివిజన్ పరిధిలో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో ఎంపీ వద్దిరాజు పాల్గొన్నారు.
కనుల పండువగా బతుకమ్మల ప్రదర్శన..
రంగు రంగుల బతుకమ్మలు సంప్రదాయ వస్త్రధారణలోని ఆడబిడ్డలు నెత్తిన అలంకారాలై నేత్ర పర్వం చేశాయి.. బతుకమ్మలను ఎత్తుకుని వందలాది మంది మహిళలు, అధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు. పలు చోట్ల బతుకమ్మలను చుట్టూ చేర్చి ఆటపాటలాడారు . మహిళా కళా బృందాల కోలాటాలు.. నృత్యాలు, మంగళవాయిద్యాల నడుమ వందలాది బతుకమ్మల ర్యాలీ నేత్ర పర్వం చేసింది. ‘ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. శ్రీలక్ష్మి నీ మహిమలు.. చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ.. అంటూ ఆడిపాడారు. బతుకమ్మలను మధ్యలో చేర్చి మహిళలంతా వలయాకారంగా ఏర్పడి, లయబద్దంగా చప్పట్లు కొడుతూ, అడుగులేస్తూ పలు బతుకమ్మ ఆటపాటలతో అలరించారు.
డీఆర్ఎస్లో బతుకమ్మ వేడుకలు
నగరంలోని డీఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో శనివారం ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. కళాశాల చైర్పర్సన్ ఉప్పల శోభారెడ్డి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తొమ్మిది రోజుల పాటు ప్రజలు ఆనందోత్సహాలతో తంగేడు, గునుగు పూలతో బతుకమ్మలను అలంకరిస్తారన్నారు. అనంతరం అధ్యాపకులతో కలిసి ఆడిపాడారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ మోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, వెంకటకృష్ణ పాల్గొన్నారు.
బతుకమ్మ సంబురాలు తొలిరోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఊరూవాడా ఉయ్యాల పాటలు మార్మోగాయి. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో.. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు చేరి ఆడిపాడారు. రాగయుక్తమైన పాటలకు లయబద్ధమైన తాళం వేస్తూ మహిళలు ఆడిపాడారు. పూల సింగిడి నేలకు దిగిందా అన్నట్లుగా చౌరస్తాలన్నీ బతుకమ్మలతో మురిసిపోయాయి. ఖమ్మం నగరం పాండురంగాపురంలో రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో మహిళలు పెద్ద ఎత్తున చేరి బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు. ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DDLJ Movie | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. థియేటర్లలోకి ‘డిడిఎల్జె’ రీ-రిలీజ్!
AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీలేదు.. ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..!
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకున్న మహిళ.. ప్రాణాలను కాపాడుకోవడంలో కీలకం..
Man Prints Fake Rs 500 Notes | ఇంటి అద్దె చెల్లించలేక.. నకిలీ రూ.500 నోట్లు ముద్రించిన వ్యక్తి
France Protests | ఫ్రాన్స్‌లో చెలరేగిన హింస.. 1000 మంది అరెస్ట్.. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

