కొత్తగూడెంపై మమకారం
తెలుగు సినీ యవనికపై ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఉంది. ‘అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘లై’, ‘పడి పడి లేచే మనసు’, ‘సీతారామం’ వంటి దృశ్యకావ్యాలను వెండి తెరపై ఆవిష్కరించారు. అభిరుచి గల దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
- స్నేహితుల ప్రేమకథలే నా చిత్రాలకు పునాది
- నిజ జీవిత ఘటనలకు ప్రాధాన్యం ఇస్తా
- ‘నమస్తే’తో సినీ దర్శకుడు హను రాఘవపూడి
కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 27: తెలుగు సినీ యవనికపై ఆయనకంటూ ప్రత్యేక స్థానం ఉంది. ‘అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘లై’, ‘పడి పడి లేచే మనసు’, ‘సీతారామం’ వంటి దృశ్యకావ్యాలను వెండి తెరపై ఆవిష్కరించారు. అభిరుచి గల దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనెవరో కాదు సినీ దర్శకుడు హను రాఘవపూడి. ఆయన స్వస్థలం కొత్తగూడెం. సోమవారం ఆయన కొత్తగూడెంలో జరిగిన ఓ ప్రైవేటు ఫంక్షన్‌కు హాజరయ్యారు. ‘నమస్తే’తో కాసేపు ముచ్చటించారు.
డైరెక్టర్ అవుతానని అనుకోలేదు..
నేను 1- 7వ తరగతి వరకు బాబూక్యాంప్ జేబీఎస్ స్కూల్, 8-10 సింగరేణి స్కూల్, ఇంటర్మీడియట్ లక్ష్మీదేవిపల్లి కృష్ణవేణి జూనియర్ కాలేజీ, డిగ్రీ వివేకవర్ధని డిగ్రీ కళాశాలలో చదివా. అమ్మ సూర్యకుమారి కోర్టులో సీఎంవో. నాన్న సన్యాసిరావు సింగరేణి ఉద్యోగి. కాలేజీ రోజుల్లో స్నేహితులతో కలిసి హ్యాపీగా గడిపేవాడిని. నాకు సాహిత్యమంటే ప్రత్యేక ఆసక్తి. అప్పట్లో చిన్న కవితలు, కథలు రాసేవాడిని. డిగ్రీ చదివేటప్పుడు స్నేహితులతో కలిసి సినిమాలు బాగా చూసే వాడిని. డిగ్రీ తర్వాత ఉద్యోగం చేయడం ఇష్టం లేక 2001లో ‘ఐతే’ సినిమా డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరా. ఆయనతో 2010 వరకు ప్రయాణం చేశాను. ‘అందాల రాక్షసి’ మూవీతో దర్శకుడినయ్యాను. దర్శకుడినవుతానని ఎప్పుడూ అనుకోలేదు.
నాకు తెలిసిన ప్రేమకథలు తెరపై..
ప్రేమకథలను సినిమాగా తీయడమంటే నాకెంతో ఇష్టం. ఇండస్ట్రీలో నాకదే పేరు ఉంది. నా స్నేహితుల ప్రేమకథలే నాకు స్ఫూర్తి. నిజ జీవితంలో జరిగిన ఘటనలను నా సినిమాల్లో వాడుతుంటాను. కానీ నా జీవితంలో ఎలాంటి ప్రేమకథ లేదు. నాది పెద్దలు కుదిర్చిన వివాహమే. నా సతీమణి అమూల్య దంత వైద్యురాలు. మాకు కుమారుడు, కుమార్తె. త్వరలో నేను ‘మైత్రీ మూవీస్’ బేనర్‌పై ఓ చిత్రం తీయబోతున్నాను. నాకు పుట్టిన ఊరు కొత్తగూడెం అంటే ఎంతో మమకారం. కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌కు వచ్చి నన్ను సంప్రదించిన వారిలో ఎంతోమందికి సినిమా రంగంలో అవకాశాలు కల్పించాను. ఇక ముందూ తోచిన సాయం చేస్తాను.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

