ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి
నిష్ణాతులైన ఉపాధ్యాయులు బోధించే ప్రభుత్వ పాఠశాలల్లోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావులు కోరారు.
- బడిబాటలో భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక, జెడ్పీ చైర్మన్ కంచర్ల
చుంచుపల్లి/పాల్వంచ, జూన్ 12 : నిష్ణాతులైన ఉపాధ్యాయులు బోధించే ప్రభుత్వ పాఠశాలల్లోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావులు కోరారు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా బుధవారం చుంచుపల్లి మం డలం విద్యానగర్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో, పాల్వంచ మండలం ప్రశాంత్‌నగర్ ఎంపీపీఎస్‌లో చేపట్టిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాలల పునఃప్రారంభం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం మంచి పరిణామమన్నారు. పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించిందన్నారు. ప్రభుత్వ కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు. అనంతరం బడిబాట వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, అదనపు కలెక్టర్ విద్యాచందన, ఆర్డీవో మధు, డీఈవో వెంకటేశ్వరాచారి, ఎంఈవో జుంకీలాల్, ఎంపీపీ బాదావత్ శాంతి, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ రాజకుమారి, స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో అశోక్, ఎంపీవో సత్యనారాయణ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

