పనులు త్వరగా పూర్తిచేయాలి
జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మిగులు పనులను ఆగస్టు చివరి వరకు పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ ఆధికారులను ఆదేశించారు. ఆయా పాఠశాలల్లో చేపట్టిన పనుల పురోగతిపై వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
- ‘అమ్మ ఆదర్శ స్కూళ్ల’లో మిగిలిన వర్కులు ఆగస్టు చివరికి ముగించాలి
- పనుల పురోగతిపై అధికారుల సమీక్షలో ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్
మామిళ్లగూడెం, జూలై 24: జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మిగులు పనులను ఆగస్టు చివరి వరకు పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ ఆధికారులను ఆదేశించారు. ఆయా పాఠశాలల్లో చేపట్టిన పనుల పురోగతిపై వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 955 పాఠశాలల్లో పనులను ప్రారంభించామని, ఇప్పటి వరకు 508 పాఠశాలల్లో మాత్రమే పూర్తి చేయాగలిగామని అన్నారు. మరో 447 పాఠశాలల్లో పనులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు.
వాటిని వెంటనే పూర్తి చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో టీజీఈడబ్ల్యూఐడీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న 73 పనులు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. మిగిలిన పనులను ఆయా ఇంజినీరింగ్ విభాగాల అధికారులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు పూర్తి చేసిన వెంటనే ఎంబీ రికార్డు చేసి చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇన్చార్జి అదనపు కలెక్టర్, డీఆర్డీవో సన్యాసయ్య, వివిధ శాఖల అధికారులు సోమశేఖరశర్మ, హేమలత, వెంకటరెడ్డి, వేణు, శ్రీరాంకోటి నాయక్, కృష్ణలాల్, రాజు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

