నారీకేళం సరికొత్త రూపం..
మనం ప్రతిరోజూ రకరకాల వస్తువులను ఎడాపెడా వాడేస్తుంటాం. బోలెడన్ని పదార్థాలు తింటూ ఉంటాం. కానీ, వాడిపడేసిన వస్తువులు, సీసాలు, పాత ఎలక్ట్రానిక్ సామగ్రిని రీ సైకిల్ చేసి మళ్లీ వినియోగంలోకి తెచ్చే ఆలోచనే చేయం.
- కొబ్బరి వ్యర్థాలతో అందమైన కళాకృతులకు జీవం..
- పారేసిన చిప్పలతో కాఫీ కప్పులు, ఫ్లవర్ వాజ్‌లు సహా మరెన్నో..
- విశ్రాంత జీవనంలోనూ అద్భుత, సృజనాత్మక ఆలోచనలు..
- కొబ్బరిచిప్పల కళాకృతుల నిలయంగా రామారావు నివాసం..
- ఆరోగ్యంపై శ్రద్ధతో మిద్దెపైనే కూరగాయలు, ఆకుకూరల పెంపకం
సారపాక, సెప్టెంబర్ 24:మనం ప్రతిరోజూ రకరకాల వస్తువులను ఎడాపెడా వాడేస్తుంటాం. బోలెడన్ని పదార్థాలు తింటూ ఉంటాం. కానీ, వాడిపడేసిన వస్తువులు, సీసాలు, పాత ఎలక్ట్రానిక్ సామగ్రిని రీ సైకిల్ చేసి మళ్లీ వినియోగంలోకి తెచ్చే ఆలోచనే చేయం. అలాంటి వస్తువులు పోగై కొండంత చెత్తగా మారుతుంటే పక్కన పడేస్తుంటాం గానీ కనీసం పట్టించుకోం. అయితే మనకు భిన్నంగా ఆలోచిస్తున్నాడు బూర్గంపహాడ్ మండలం తాళ్లగొమ్మూరుకు చెందిన సింగరేణి విశ్రాంత ఉద్యోగి అల్లం రామారావు. ‘కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల..’ కాదేదీ కవితకు అనర్హం ఉన్నట్లు.. ఈ రామారావు కూడా కొబ్బరి వ్యర్థాలతో అందమైన కళాకృతులకు జీవం పోస్తున్నాడు. ఏడు పదుల వయసులోనూ అద్భుతమైన, సృజనాత్మకమైన ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నాడు. వాడిపారేసిన కొబ్బరిచిప్పలకు కొత్తరూపుమిస్తూ వివిధ రకాల కళాకృతులకు ప్రాణం పోస్తునాడు.
బూర్గంపహడ్ మండలం తాళ్లగొమ్మూరుకు చెందిన సింగరేణి విశ్రాంత ఉద్యోగి అల్లం రామారావు. మణుగూరులో 35 ఏళ్ల సర్వీసు అనంతరం 2015లో ఉద్యోగ విరమణ పొందారు. తన ముగ్గురు కుమార్తెలకు వివాహాలు జరిపించాడు. తన సహధర్మచారిణితో కలిసి తాళ్లగొమ్మూరులోని తన ఇంటి వద్దే శేష జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ విశ్రాంత జీవనంలో ఖాళీగా ఉండకుండా సరికొత్త వ్యాపకం పెట్టుకోవాలనుకున్నాడు. సమయం చిక్కినప్పుడల్లా అందమైన కళాకృతులను తీర్చిదిద్దే ఆలోచనకు పదునుపెట్టాడు. కొబ్బరిచిప్పలతో అందమైన కళాకృతులను తీర్చిదిద్దే వ్యాపకంలో నిమగ్నమయ్యాడు. వాడిపారేసిన కొబ్బరిచిప్పలను వాడి పారేస్తుంటే.. రామారావు మాత్రం వాటిని సేకరించి విభిన్న కళాకృతులుగా వాటికి రూపమిస్తున్నాడు. కాఫీ కప్పులు, పూజా సామగ్రి, ఫ్లవర్ వాజ్‌లు సహా మరెన్నో కళాకృతులు తీర్చిదిద్దుతున్నాడు. యంత్రాలు వినియోగించకుండా అతడి చేతులతో చేసిన ఈ వస్తువులు అతడి చేతిలో ప్రాణం పోసుకున్నట్లుగా కన్పిస్తుంటాయి.
గృహాలంకరణ వస్తువుల తయారీ..
కొబ్బరిచిప్పలను సేకరించిన రామారావు.. ఎమ్రాన్ పేపర్‌తో వాటిని నునుపుగా చేస్తాడు. అనంతరం వాటిని అవసరమైన రూపాల్లో తయారుచేస్తాడు. కలపకు వాడే పాలిష్‌ను అద్దుతాడు. దీంతో వస్తువులు అందంగా తయారవ్వడంతోపాటు మెరుపును సొంతం చేసుకుంటాయి. కొబ్బరిచిప్పలను అందంగా కత్తిరించి ఆకర్షణీయమైన గృహాలంకరణ వస్తువులను తయారు చేస్తుంటాడు. వాటిని తన స్నేహితులు, బంధువులకు వివిధ శుభకార్యాల్లో బహుమతులుగా అందిస్తుంటాడు. కొబ్బరిచిప్పలను వృథాగా పోనీయకుండా వాటిని తిరిగి ఎలా ఉపయోగించుకోవొచ్చో తెలియజేస్తున్న వ్యక్తి రామారావు. బంధువులు, స్నేహితులు.. రామారావు ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ కొబ్బరిచిప్పల కళాకృతులను చూసి అబ్బురపడి వాటిని తమ ఇళ్లకు తీసుకెళ్తుంటారు. అలాగే, ఏదైనా వేడుకులకు, శుభకార్యాలకు రామారావు వెళ్లినా తాను తీర్చిదిద్దిన కళారూపాలనే బహుమతులుగా అందిస్తుంటాడు.
ఆరోగ్యంపై శ్రద్ధ.. మిద్దెపై సాగు..
ఖాళీ సమయాల్లో రామారావు కళాకృతులు తయారుచేయడమే కాదు.. తన ఇంటి మిద్దెపై సేంద్రియ ఎరువులతో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తుంటాడు. ఆరోగ్యంపైనా అధిక శ్రద్ధ చూపే రామారావు దంపతులు.. ఎక్కువభాగం తమ ఇంట్లో వంటకు వీటినే వినియోగి స్తుంటారు. ప్రకృతిని ఆస్వాదించడం, వ్యాయామం చేయడం తమ వ్యాపకమంటూ చెబుతున్నారు రామారావు దంపతులు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో ఎలక్ట్రికల్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

