కొత్త మోడళ్లు.. సరికొత్త వాహనాలు
ఆటో రంగంలో తీరొక్క వాహనాలు సాక్షాత్కరిస్తున్నాయి. కంపెనీ ఏదైనా సరే.. మోడళ్లకు కొదవ లేదు. మారుతున్న ట్రెండ్‌కు తగినట్లుగా, యూత్‌ను ఆకట్టుకునే విధంగా బైక్‌లు, కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. యువత మనసును దోచేలా ఆకర్షణీయ రంగుల్లో.. అభిరుచికి తగినట్లుగా నూతన మోడళ్లతో రూపుదిద్దుకొని మన కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయి.
- నూతన మోడళ్లతో రూపుదిద్దుకుంటున్న కార్లు, బైక్‌లు
- ట్రెండ్‌కు తగినట్లుగా మార్కెట్లోకి తెస్తున్న కంపెనీలు
- షోరూంలలో ఆకట్టుకుంటున్న సరికొత్త వాహనాలు
రఘునాథపాలెం, జనవరి 29 : ఆటో రంగంలో తీరొక్క వాహనాలు సాక్షాత్కరిస్తున్నాయి. కంపెనీ ఏదైనా సరే.. మోడళ్లకు కొదవ లేదు. మారుతున్న ట్రెండ్‌కు తగినట్లుగా, యూత్‌ను ఆకట్టుకునే విధంగా బైక్‌లు, కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. యువత మనసును దోచేలా ఆకర్షణీయ రంగుల్లో.. అభిరుచికి తగినట్లుగా నూతన మోడళ్లతో రూపుదిద్దుకొని మన కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయి. ఇక కార్ల గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడొచ్చే నూతన మోడల్ కార్లలో ప్రయాణం స్వర్గాన్ని తలపిస్తుందనేలా ఉంటున్నాయి. కారు స్టార్ట్ చేసి దూరపు ప్రయాణం మొదలు పెడితే.. అప్పుడే గమ్యం చేరిపోయామా అనే ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంటున్నాయి. బైక్‌ల విషయానికొస్తే.. రోడ్డెక్కితే రయ్య్ అంటూ క్షణాల్లో కావాల్సినంత వేగంతో ప్రయాణించేలా అందుబాటులోకి వచ్చాయి. వాహనాలను తయారు చేసే దిగ్గజ ఆటోరంగ సంస్థలన్నీ పోటీపడి కస్టమర్లు మెచ్చేలా సాంకేతికతను జోడించి తయారు చేస్తున్నాయి. టీవీఎస్, సుజుకీ, హీరో, హోండా, బజాజ్ వంటి బైక్‌ల కంపెనీలు, హ్యుందాయ్, మహీంద్రా, కియా వంటి అనేక దిగ్గజ కార్ల కంపెనీలు ఏటికేడాది పోటీలు పడుతూ సరికొత్త వెర్షన్లను అందుబాటులోకి తెస్తున్నాయి. కొత్త మోడళ్లతో సరికొత్తగా వాహనాలు మార్కెట్లోకి రావడంతో డిమాండ్ సైతం అదే రీతిలో ఉంటోంది. కొన్ని సమయాల్లో నచ్చిన వాహనం కావాలంటే ముందుగా బుక్ చేసుకొని నెలలతరబడి వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంటోంది. అలా వాహనాలకు డిమాండ్ కూడా పెరిగిపోతోంది. మైలేజీతో ఆకట్టుకునే కార్లు, బైక్‌లు సైతం మార్కెట్లో అనేకం ఉంటున్నాయి. మైలేజ్‌ను చూసి కొనుగోలు చేసే వారు కొందరైతే.. వాహనాన్ని క్రేజీగా వినియోగించుకునేందుకు మైలేజీతో సంబంధం లేకుండా కొనుగోలు చేసేవారు మరికొందరు. ఇలా భిన్న అభిరుచులకు తగినట్లుగా విభిన్న మోడళ్ల వాహనాలు రహదారులపై కన్పిస్తున్నాయి.
సరికొత్త మోడళ్లకు వేదికగా వజ్ర టీవీఎస్
వజ్ర టీవీఎస్ సంస్థ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ప్రస్తుతం షోరూంలో టీవీఎస్ ఎక్సెల్, జుపిటర్, రైడర్, అపాచీ, ఎంటార్క్, స్టార్ సిటీ రేడియాన్ వంటి 11 వెరైటీలతో వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపే వారికోసం డిస్కౌంట్ సౌకర్యం కల్పిస్తున్నాం. మా సంస్థ తయారు చేసే వాహనాలు వాహనదారులు మెచ్చేలా ఉంటాయి.
– దినేశ్‌కుమార్, షోరూం మేనేజింగ్ డైరెక్టర్, ఖమ్మం
కార్ల తయారీకి కాకతీయ టయోటా పెట్టింది పేరు..
కార్ల తయారీకి కాకతీయ టయోటా పెట్టింది పేరుగా నిలుస్తోంది. సంస్థ 11 మోడల్స్‌తో సాంకేతికతను జోడించి సరికొత్తగా తయారు చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్లాంజా, రూమియన్, హైరైడర్, ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్, ఫార్చునర్, కామరీ, హైలక్స్, వెల్ఫైర్, ఎల్సీ-300 మోడళ్లు ప్రస్తుతం మా షోరూంలో విభిన్న రంగుల్లో ఉన్నాయి. పలు రకాల కార్లపై ప్రత్యేక డిస్కౌంట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం.
– అమరేందర్, కాకతీయ టయోటా జీఎం, ఖమ్మం
నిత్యం సరికొత్త వాహనాలు వస్తున్నాయి..
సరికొత్త ఫీచర్లతో కూడిన వాహనాలు నిత్యం మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. వాటి రిజిస్ట్రేషన్ నిమిత్తం అవన్నీ మా కార్యాలయానికి రోజూ వస్తూనే ఉంటాయి. వాహనదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త మోడళ్లతో కంపెనీలు వాహనాలను తయారు చేస్తున్నాయి. సీసీకి తగినట్లుగా ఆటోరంగ సంస్థలు కార్లు, బైక్‌లను ఏటికేడాది నూతన సాంకేతిక విధానంతో తయారు చేస్తున్నాయి.
-మహ్మద్ గౌస్ పాషా, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఖమ్మం
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
- Tags
- auto sector
- Bikes
- Cars
- new vehicles
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

