లోక్‌సభ ఎన్నికలకు..గులాబీ దండు సమాయత్తం
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయం సాధించేందుకు ఆ పార్టీ గురువారం ఖమ్మంలో శంఖారావం పూరించనుంది.
- నేడు నగరంలో ఖమ్మం పార్లమెంటరీ స్థాయి విస్తృత సమావేశం
- హాజరుకానున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
- పాల్గొననున్న నామా, వద్దిరాజు, పార్థసారథిరెడ్డి, తాతా మధు, అజయ్
- పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్న యువనేత
ఖమ్మం, మార్చి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయం సాధించేందుకు ఆ పార్టీ గురువారం ఖమ్మంలో శంఖారావం పూరించనుంది. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీకి మెజారిటీ సంఖ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు. దీంతో ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు పార్టీ కార్యాచరణ ప్రారంభించింది. ఖమ్మం లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.
రెండుసార్లు ఎంపీగా, ఒకసారి టీడీపీ లోక్‌సభా పక్ష నేతగా, మరోసారి బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేతగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ప్రజా సమస్యలపైనా పూర్తి అవగాహన ఉంది. రాజనీతి వ్యవహారాలపై తిరుగులేని పట్టు ఉంది. దీంతో నామా నాగేశ్వరరావును పార్టీ అధినేత ఖరారు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా కమిటీ గురువారం ఖమ్మం పార్లమెంటరీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు బుధవారం మీడియా సమావేశంలో వివరించారు.
గురువారం ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని వీవీసీ ఫంక్షన్ హాల్లో జరిగే ఈ సమావేశానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం చేయాల్సిన కృషి, అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకాచౌదరిపై 1.66 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాధించి బీఆర్ఎస్ సత్తా చాటిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కూడా పార్టీ విజయం సాధించడం ఖాయమని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణులను పూర్తిస్థాయిలో కార్యోన్ముఖులను చేసేందుకు గురువారం ఈ సమావేశం నిర్వహించనున్నారు.
ప్రతి నియోజకవర్గం నుంచి నియోజకవర్గ ఇన్చార్జులు, మాజీ శాసనసభ్యులు, పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణను ఈ సమావేశంలో రూపొందిచనున్నారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు అధ్యక్షత వహించనున్నారు. ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, రాములునాయక్, మదన్‌లాల్, బానోతు చంద్రావతి, కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

