TRS | రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం మనది: అంకిరెడ్డి కృష్ణారెడ్డి

చండ్రుగొండ: రైతుల కోసమే పనిచేసే ప్రభుత్వం మనది అని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రైతుబంధు పథకం సంబురాల సందర్బంగా విద్యార్దులకు వ్యాసరచన, ముగ్గులపోటీలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. పోటీల్లో గెలుపొందినవారికి ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…దేశంలోనే అత్యధికంగా రైతుల కోసం నిధులు కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఒక్కటేనన్నారు. రైతులను ఆర్దికంగా నిలదొక్కుకోవడం కోసం ముఖ్యమంత్రి రైతుబంధు పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి, సర్పంచ్ మలిపెద్ది లక్ష్మిభవాని, ఎంపిటీసీ దారా వెంకటేశ్వరరావు, ఎస్ఎంసి చైర్మన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి,పాఠశాల హెచ్ఎం మంజుశ్రీ ,గానుగపాడు సోసైటి చైర్మన్ చెవుల చందర్రావు, మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, టిఆర్ఎస్ నాయకులు మాలోత్ భోజ్యనాయక్, సారేపల్లి శేఖర్, మద్దిరాల చిన్నపిచ్చయ్య, సూర వెంకటేశ్వరరావు, వంకాయలపాటి బాబురావు, కొత్తూరి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

