MLA VANAMA | తాగునీటికి అంతరాయంకలుగనివ్వకండి: ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

కొత్తగూడెం: తాగునీటికి అంతరాయం కలగొద్దని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కిన్నెరసాని నుంచి కొత్తగూడెం పట్టణానికి నీటి సరఫరా చేసే పైప్లైన్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొర్రేడువాగు ఉదృతంగా ప్రవహించడం వల్ల పైప్లైన్లు కొట్టుకుపోయాయని, దీని వల్ల నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, వెంటనే ఆ పనులను యుద్ద ప్రాతిపదిన పూర్తి చేయాలనిఆయన అధికారులను ఆదేశించారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ… పట్టణంలోని నీటి సమస్యపై చర్చించారు. పట్టణంలోని ప్రతీ వార్డుకు ప్రస్తుతం ఉన్న వాటర్ ట్యాంకులకు అదనంగా ట్యాంకర్లు తెప్పించి తాగునీరు పరఫరా చేయాలని సూచించారు.
కిన్నెరసాని నుంచి కొత్తగూడెం పట్టణానికి నీటి సరఫరాకు సంబంధించిన కాల్వ తండా వద్ద సబ్ స్టేషన్ పనులను, వాటర్ సంపు పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి దసరా పండుగ లోపు పని పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ, వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, కమిషనర్ అరిగెల సంపత్కుమార్, మున్సిపల్ ఏఈ, మిషన్ భగీరథ ఇంజనీర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

