విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
బూర్గంపహాడ్ మండల పరిధిలోని ముసలిమడుగు గ్రామంలో రూ.2.50 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం (సబ్ స్టేషన్) నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సర్పంచ్, ట్రాన్స్‌కో అధికారులతో కలిసి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
బూర్గంపహాడ్, అక్టోబర్ 16 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని ముసలిమడుగు గ్రామంలో రూ.2.50 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం (సబ్ స్టేషన్) నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సర్పంచ్, ట్రాన్స్‌కో అధికారులతో కలిసి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం లక్ష్యంగా ఈ సబ్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యుత్ ఉపకేంద్రం అందుబాటులోకి వస్తే ముసలిమడుగు పంచాయతీతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు, రైతులకు విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, సర్పంచ్ పూనెం సురేందర్, భద్రాచలం ట్రాన్స్‌కో డీఈ జీవన్ కుమార్, ఏడీఈ నర్సింహారావు, సారపాక ట్రాన్స్‌కో ఏఈ గుర్రం ఉపేందర్‌తో పాటు మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీపురం మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పూలపెల్లి సుధాకర్‌రెడ్డి, మారం వెంకటేశ్వరరెడ్డి, వారాల వేణు, పలు పంచాయతీల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
Donation | కొమురం భీమ్ విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ నాయకుడు విరాళం
IT Park | చౌటుప్పల్ ఐటీ పార్కులో భారీ పేలుడు.. వ్యక్తి మృతి
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రాపోలు పరమేశ్
‘కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

